శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 448 పాయింట్లు పెరిగి 84,930 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 151 పాయింట్లు వృద్ధిచెంది 25,966 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 59,069 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,830.89 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,722.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 19,857.37 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 52,032.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 140 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
నిఫ్టీ50 కీలక దశలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ దిశ కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. కీలక రెసిస్టెన్స్ దాటేందుకు సూచీ కష్టపడుతుండటంతో షార్ట్ టర్మ్ ట్రేడింగ్‌లో జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు.
“నిఫ్టీ50 20 డీఈఎంఏ, 50 డీఈఎంఏ, 200 డీఈఎంఏ ఎగువన ట్రేడ్ అవుతోంది. ఇది బుల్లిష్ స్ట్రక్చర్కి సంకేతం. మరోవైపు 26000 కీలక రెసిస్టెన్స్ ఉంది. ఆ తర్వాత 26,200 కూడా రెసిస్టెన్స్‌గా ఉంది. 25,900- 25,800- 25,700 లెవల్స్ సపోర్ట్ ఉన్నాయి. ఇవి బ్రేక్ అయితే సూచీలో సెల్లింగ్ ప్రెజర్ కనిపించవచచు,” అని చాయిస్ బ్రోకింగ్ సంస్థకు చెందిన రీసెర్చ్ ఎనలిస్ట్ హితేశ్ టైలర్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.9 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.4శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.3 శాతం పెరిగింది.
{{/usCountry}}శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.9 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.4శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.3 శాతం పెరిగింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కోరమాండల్ ఇంటర్నేషనల్: రూ .2425 వద్ద కొనండి, లక్ష్యం రూ .2626, స్టాప్ లాస్ రూ .2323;
లుమాక్స్ ఆటోటెక్నాలజీస్: రూ .1545 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ .1650, స్టాప్ లాస్ రూ .1495;
హెక్సావేర్ టెక్నాలజీస్: రూ .791 వద్ద కొనండి, లక్ష్యం రూ .850, స్టాప్ లాస్ రూ .760;
స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్: రూ .930 వద్ద కొనండి, రూ .1000 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .895;
సాయి లైఫ్ సైన్సెస్: రూ .917 వద్ద కొనండి, లక్ష్యం రూ .985, స్టాప్ లాస్ రూ .888.