ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..

డిసెంబర్​ 22, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 22, 2025, 08:15:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 448 పాయింట్లు పెరిగి 84,930 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 151 పాయింట్లు వృద్ధిచెంది 25,966 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 59,069 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,830.89 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,722.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 19,857.37 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 52,032.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 140 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

నిఫ్టీ50 కీలక దశలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్​ దిశ కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. కీలక రెసిస్టెన్స్​ దాటేందుకు సూచీ కష్టపడుతుండటంతో షార్ట్​ టర్మ్​ ట్రేడింగ్​లో జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు.

“నిఫ్టీ50 20 డీఈఎంఏ, 50 డీఈఎంఏ, 200 డీఈఎంఏ ఎగువన ట్రేడ్​ అవుతోంది. ఇది బుల్లిష్​ స్ట్రక్చర్​కి సంకేతం. మరోవైపు 26000 కీలక రెసిస్టెన్స్​ ఉంది. ఆ తర్వాత 26,200 కూడా రెసిస్టెన్స్​గా ఉంది. 25,900- 25,800- 25,700 లెవల్స్​ సపోర్ట్​ ఉన్నాయి. ఇవి బ్రేక్​ అయితే సూచీలో సెల్లింగ్​ ప్రెజర్​ కనిపించవచచు,” అని చాయిస్​ బ్రోకింగ్​ సంస్థకు చెందిన రీసెర్చ్​ ఎనలిస్ట్​ హితేశ్​ టైలర్​ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.9 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.4శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.3 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

కోరమాండల్ ఇంటర్నేషనల్: రూ .2425 వద్ద కొనండి, లక్ష్యం రూ .2626, స్టాప్ లాస్ రూ .2323;

లుమాక్స్ ఆటోటెక్నాలజీస్: రూ .1545 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ .1650, స్టాప్ లాస్ రూ .1495;

హెక్సావేర్ టెక్నాలజీస్: రూ .791 వద్ద కొనండి, లక్ష్యం రూ .850, స్టాప్ లాస్ రూ .760;

స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్: రూ .930 వద్ద కొనండి, రూ .1000 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .895;

సాయి లైఫ్ సైన్సెస్: రూ .917 వద్ద కొనండి, లక్ష్యం రూ .985, స్టాప్ లాస్ రూ .888.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More