వరుణ్​ బేవరేజ్​​ స్టాక్​లో మూమెంట్- షేరు ధర ఇంకా పెరిగే ఛాన్స్​..

డిసెంబర్​ 23, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 23, 2025, 08:15:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి! బీఎస్​ఈ సెన్సెక్స్​ 638 పాయింట్లు పెరిగి 85,567 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 206 పాయింట్లు వృద్ధిచెంది 26,172 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 235 పాయింట్లు పెరిగి 59,304 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4571.34 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,058.22 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ డిసెంబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 20,314.71 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 56,090.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50లో ట్రెండ్​ పాజిటివ్​గా ఉంది. ముమెంటమ్​ ఇండికేటర్స్​ మెరుగ్గా ఉన్నాయి. ఫాలింగ్​ వెడ్జ్​ బ్రేకౌట్​ తర్వాత మరింత పైకి వెళుతోంది. ఆర్​ఎస్​ఐలో బలమైన పాజిటివ్​ ముమెంటమ్​ కనిపిస్తోంది. సూచీ 25,900 ఎగువన ఉన్న వరకు పాటిజివ్​ ట్రెండ్​ ఉన్నట్టు. 26,315 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.47 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.64శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.52 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

వరుణ్ బేవరేజ్​: రూ .485.65 వద్ద కొనండి, టార్గెట్ రూ .515, స్టాప్ లాస్ రూ .470;

త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్: రూ .389.55 వద్ద కొనండి, టార్గెట్ రూ .415, స్టాప్ లాస్ రూ .374;

బీఈఎంఎల్: రూ .1795.80 వద్ద కొనండి, టార్గెట్ రూ .1930, స్టాప్ లాస్ రూ .1725;

చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్: రూ.465.95 వద్ద కొనండి, రూ.505 టార్గెట్, స్టాప్ లాస్ రూ.445;

టిటాగర్ రైల్ సిస్టమ్స్: రూ .816.50 వద్ద కొనండి, టార్గెట్ రూ .890, స్టాప్ లాస్ రూ .777.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More