24 డిసెంబర్ : ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్‌లో ట్రేడ్‌తో లాభాలు?
డిసెంబర్ 24, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 43 పాయింట్లు పడి 85,525 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 5 పాయింట్లు పెరిగి 26,177 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 4 పాయింట్లు పడి 59,300 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,794.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,812.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 22,109.51 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 59,902.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“26,200 వద్ద రెసిస్టెన్స్‌ని ఎదుర్కొన్న అనంతరం నిఫ్టీ50 లాభాలకు బ్రేక్ పడింది. డైలీ చార్ట్ క్యాండిల్‌లో చిన్న బేరిష్ క్యాండిల్ ఏర్పడింది. కానీ ఆర్ఎస్ఐ, మాక్డీ వంటి కీలక ఇండికేటర్లు ఫేవరెబుల్గానే ఉన్నాయి. ఇప్పుడు సపోర్ట్ 26,000 జోన్‌కి షిఫ్ట్ అయ్యింది. 21డీఎంఏ కూడా ఇక్కడే ఉంది. సూచీ 26,300 వరకు వెళ్లొచ్చు,” అని సెంట్రమ్ బ్రోకింగ్‌కి చెందిన టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ ఎనలిస్ట్- హెడ్ నిలేశ్ జైన్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.2 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.5శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.6 పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
నైకా- బై రూ. 256, స్టాప్ లాస్ రూ. 248, టార్గెట్ రూ. 265
జేబీఎం ఆటో- బై రూ. 250, స్టాప్ లాస్ రూ .240, టార్గెట్ రూ. 270
బాల్మర్ లారేయ్- బై రూ. 180, స్టాప్ లాస్ రూ. 176, టార్గెట్ రూ. 190
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్- బై రూ. 104.89, స్టాప్ లాస్ రూ. 99.70, టార్గెట్ రూ. 115
ఎన్ఎల్సీ ఇండియా- బై రూ. 251.90, స్టాప్ లాస్ రూ .240, టార్గెట్ రూ. 275
జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్- బై రూ. 510.3, స్టాప్ లాస్ రూ. 488, టార్గెట్ రూ. 550
అఫిల్ 3ఐ- బై రూ. 1766, స్టాప్ లాస్ రూ. 1690, టార్గెట్ రూ. 1910
శారదా ఎనర్జీ అండ్ మినరల్స్- బై రూ. 530. 25, స్టాప్ లాస్ రూ. 508, టార్గెట్ రూ. 570
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


