Stocks to buy today : ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 8 స్టాక్స్ టు బై లిస్ట్..
ఫిబ్రవరి 24, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 480 పాయింట్లు పెరిగి 83,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 142 పాయింట్లు వృద్ధిచెంది 25,713 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 92 పాయింట్లు పెరిగి 61,264 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,483.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,292.24 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 1,472.46 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,818.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ ఛార్ట్‌లో అప్పర్- లోయర్ షాడోలతో కూడిన స్మాల్ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. ఇది వొలటాలిటీతో కూడిన అప్మూవ్కి సంకేతం. ప్రస్తుతానికి నిఫ్టీ50కి 25,800- 25,850 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. 25,550 వద్ద సపోర్ట్ ఉంది, సూచీ 25,900 దాటితే అప్‌ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ నాగారాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.66 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.04 శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.13 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
బంగారం, వెండి ధరలు ఇలా..
4 రోజుల లాభాలకు బ్రేక్ ఇస్తూ.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్పాట్ గోల్డ్ 0.7శాతం పడి ఔన్సుకు రూ. 5,187 వద్ద ఉంది. ఇక స్పాట్ సిల్వర్ 0.32శాతం కూల్ అయ్యి ఔన్సుకు 86.32 డాలర్ల వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
డా. రెడ్డీస్ లెబోరేటరీస్- బై సీఎంపీ, టార్గెట్ రూ. 1415, స్టాప్ లాస్ రూ.1250
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)- బై సీఎంపీ, టాస్గెట్ రూ. 188, స్టాప్ లాస్ రూ. 170.40
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్- బై సీఎంపీ, టార్గెట్ రూ. 2250, స్టాప్ లాస్ రూ. 2040
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
సిటీ యూనియన్ బ్యాంక్- బై రూ. 291, స్టాప్ లాస్ రూ. 281, టార్గెట్ రూ. 312
పృథ్వి స్పెషాలిటీ కెమికల్స్- బై రూ. 2994, స్టాప్ లాస్ రూ. 2890, టార్గెట్ రూ. 3200
కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)- బై రూ 717, స్టాప్ లాస్ రూ. 690, టార్గెట్ రూ. 770
ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్- బై రూ. 4647, స్టాప్ లాస్ రూ. 4450, టార్గెట్ రూ. 4950
ఇంజర్సోల్- ర్యాండ్ (ఇండియా)- బై రూ. 3988, స్టాప్ లాస్ రూ. 3820, టార్గెట్ రూ. 4270
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


