ట్రేడర్స్ అలర్ట్! నిపుణులు సిఫార్సు చేసిన 10 stocks to buy లిస్ట్ ఇది..
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 331 పాయింట్లు పడి 84,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 109 పాయింట్లు కోల్పోయి 25,959 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 325 పాయింట్లు పడి 58,835 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,071.63 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,373.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ సెప్టెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 17,032.93 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 43,578.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 12 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 25,950 దిగువకు వెళితే, మరింత ఒత్తిడి కనిపించవచ్చు. 25,850 వద్ద సపోర్ట్ ఉంది. 26,100 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ ఎనలిస్ట్ వత్సల్ భవ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.44 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.55శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.69 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఫెడరల్ బ్యాంక్- బై రూ. 248, స్టాప్ లాస్ రూ. 239, టార్గెట్ రూ. 266
టెక్ మహీంద్రా- బై రూ. 1495, స్టాప్ లాస్ రూ. 1443, టార్గెట్ రూ. 1600
కేఈఐ ఇండస్ట్రీస్- బై రూ. 4108, స్టాప్ లాస్ రూ. 4050, టార్గెట్ రూ. 4200
ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రాడక్ట్స్- బై రూ. 940, స్టాప్ లాస్ రూ. 920, టార్గెట్ రూ. 990
ఆస్ట్రల్ లిమిటెడ్- బై రూ. 1470, స్టాప్ లాస్రూ. 1420, టార్గెట్ రూ. 1530
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
యథార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా క్రె ఎస్ఆర్వీసీఎస్: రూ.792 వద్ద కొనండి, రూ.850 టార్గెట్ రూ.850, స్టాప్ లాస్ రూ.765;
సఫారీ ఇండస్ట్రీస్ (ఇండియా): రూ .2360 వద్ద కొనండి, లక్ష్యం రూ .2540, స్టాప్ లాస్ రూ .2275;
అకుటాస్ కెమికల్స్: రూ .1872 వద్ద కొనండి, లక్ష్యం రూ .2020, స్టాప్ లాస్ రూ .1808;
డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్: రూ .506 వద్ద కొనండి, లక్ష్యం రూ .545, స్టాప్ లాస్ రూ .488;
సాయి లైఫ్ సైన్సెస్: రూ .883 వద్ద కొనండి, లక్ష్యం రూ .950, స్టాప్ లాస్ రూ .850
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


