జనవరి 27 : ట్రేడర్స్ అలర్ట్ - నేటి స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే..
3 రోజుల వరుస సెలవుల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు, జనవరి 27న ఓపెన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని, లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 770 పాయింట్లు పడి 81,538 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 241 పాయింట్లు కోల్పోయి 25,049 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 727 పాయింట్లు పడి 58,473 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,113.38 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,102.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 40,704.39 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 54,822.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 కీలకమైన 200-డే ఈఎంఏ దిగువకు పడిపోయింది. ఇది నెగిటివ్ ట్రెండ్‌ని సూచిస్తోంది. ఇతర సూచీలు కూడా వీక్నెస్ని చూపిస్తున్నాయి. నిఫ్టీ50కి 24,850 వద్ద సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 24,600 వరకు కూడా వెళ్లొచ్చు. 25,250 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి 25,500 వరకు వెళ్లొచ్చు. అప్పటివరకు సెల్-ఆన్-బై స్ట్రాటజీని అనుసరించడం ఉత్తమం,” అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్‌కి చెందిన చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ డా. రవి సింగ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.64శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.50శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.43 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
నెల్కో- బై రూ. 371, స్టాప్ లాస్ రూ. 358, టార్గెట్ రూ. 397
అశోక్ లేల్యాండ్- బై రూ. 193, స్టాప్ లాస్ రూ. 186, టార్గెట్ రూ. 207
జేఎస్‌డబ్ల్యూ స్టీల్- బై రూ. 1170, స్టాప్ లాస్ రూ. 1145, టార్గెట్ రూ. 1220
ఇండస్ టవర్స్- బై రూ. 413, స్టాప్ లాస్ రూ. 400, టార్గెట్ రూ. 440
యూపీఎల్- బై రూ. 702, స్టాప్ లాస్ రూ. 680, టార్గెట్ రూ. 740
జీఎన్ఎఫ్సీ- బై రూ. 464, స్టాప్ లాస్ రూ. 454, టార్గెట్ రూ. 486
వోల్టాస్- బై రూ. 1315, స్టాప్ లాస్ రూ. 1285, టార్గెట్ రూ. 1385
స్వాన్ కార్ప్- బై రూ. 410, స్టాప్ లాస్ రూ. 400, టార్గెట్ రూ. 435
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


