సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 84,779 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 171 పాయింట్లు వృద్ధిచెంది 25,966 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 415 పాయింట్లు పెరిగి 58,114 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 55.58 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,492.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 299.6 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 36,481.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,700 వద్ద సపోర్ట్ ఉంది. 26,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సూచీ 26,500 వరకు వెళ్లొచ్చు. కానీ 25,700 దిగువకు పడిపోతే నెగిటివ్ ట్రెండ్ ప్రారంభం అవ్వొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.71 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.23శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.8 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}లారస్ ల్యాబ్స్- బై రూ. 940, స్టాప్ లాస్ రూ. 907, టార్గెట్ రూ. 1006
ఎస్బీఐ- బై రూ. 923, స్టాప్ లాస్ రూ. 890, టార్గెట్ రూ. 990
కేఫిన్ టెక్నాలజీస్- బై రూ. 1168, స్టాప్ లాస్ రూ. 1145, టార్గెట్ రూ. 1200
ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1378, స్టాప్ లాస్ రూ. 1350, టార్గెట్ రూ. 1430
నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా- బై రూ. 3895, స్టాప్ లాస్ రూ. 3810, టార్గెట్ 4070.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
భారత్ సీట్స్: రూ.225, టార్గెట్ రూ.240, స్టాప్ లాస్ రూ.217;
జోటా హెల్త్ కేర్: రూ.1571 వద్ద కొనండి, టార్గెట్ రూ.1690, స్టాప్ లాస్ రూ.1520;
ప్రెసిషన్ వైర్స్ ఇండియా: రూ .210.7 వద్ద కొనండి, టార్గెట్ రూ .225, స్టాప్ లాస్ రూ .203;
కార్ట్రేడ్ టెక్: రూ .2665 వద్ద కొనండి, లక్ష్యం రూ .2865, స్టాప్ లాస్ రూ .2570;
పరాగ్ మిల్క్ ఫుడ్స్: రూ.317 వద్ద కొనండి, టార్గెట్ రూ.340, స్టాప్ లాస్ రూ.305.