ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రోజు ఈ 10 స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలకు ఛాన్స్​..!

డిసెంబర్​ 3 2025, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 3, 2025, 08:15:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 504 పాయింట్లు పడి 85,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 144 పాయింట్లు కోల్పోయి 26,032 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 408 పాయింట్లు పడి 59,274 వద్దకు చేరింది.

లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,642.3 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,645.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 4,813.61 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,204.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.39 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.25శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.59 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

సంవర్ధన మథర్​సన్​ ఇంటర్నేషనల్​- బై రూ. 119.26, స్టాప్​ లాస్​ రూ. 115, టార్గెట్​ రూ. 128

వేదంత- బై రూ. 538, స్టాప్​ లాస్​ రూ. 519, టార్గెట్​ రూ. 576

ఇండస్​ఇండ్​ బ్యాంక్​- బై రూ. 853, స్టాప్​ లాస్​ రూ. 840, టార్గెట్​ రూ. 875

అధానీ ఎంటర్​ప్రైజెస్​- బై రూ. 2240, స్టాప్​ లాస్​ రూ. 2180, టార్గెట్​ రూ. 2340

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 146, స్టాప్​ లాస్​ రూ. 140, టార్గెట్​ రూ. 152

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

బిర్లాసాఫ్ట్ : రూ .405 వద్ద కొనండి, టార్గెట్ రూ .433, స్టాప్ లాస్ రూ .388;

స్టెల్​ హోల్డింగ్స్: రూ .534 వద్ద కొనండి, లక్ష్యం రూ .575, స్టాప్ లాస్ రూ .515;

మిండా కార్పొరేషన్: రూ .600 వద్ద కొనండి, టార్గెట్ రూ .645, స్టాప్ లాస్ రూ .580;

జమ్నా ఆటో ఇండస్ట్రీస్: రూ .122 వద్ద కొనండి, టార్గెట్ రూ .132, స్టాప్ లాస్ రూ .118;

స్టైలం ఇండస్ట్రీస్: రూ .2140 వద్ద కొనండి, రూ .2300 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .2065.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More