Stocks to buy : డిసెంబర్​ 30- ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ ఇవి..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 30, 2025, 08:15:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 346 పాయింట్లు పడి 84,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 100 పాయింట్లు కోల్పోయి 25,942 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 79 పాయింట్లు పడి 58,932 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,759.89 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,643.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ డిసెంబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 26,908.2 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 66,700.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 చార్ట్​లో కనిపిస్తున్న లోయర్​ హైస్​- లోయర్​ లోస్​ స్వల్ప కాల వీక్​నెస్​ని సూచిస్తోంది. 25,920 దగ్గర సూచీకి సపోర్ట్​ ఉంది. అది బ్రేక్​ అయితే సూచీ 25,800 వరకు వెళ్లొచ్చు. రానున్న రోజుల్లో నిఫ్టీ50 25,800- 26,100 మధ్య కదలాడే అవకాశం ఉంది,” అని టెక్నికల్​ అండ్​ డెరివేటివ్స్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నీలేశ్​ జైన్​ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.5 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.3శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.5 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బ్రేకౌట్​​ స్టాక్స్​ టు బై..

ఎన్​ఎల్​సీ ఇండియా- బై రూ. 256.4, స్టాప్​ లాస్​ రూ. 247, టార్గెట్​ రూ. 275

ఇండియా సిమెంట్స్​- బై రూ. 448.05, స్టాప్​ లాస్​ రూ. 424, టార్గెట్​ రూ. 490

సిటీ యూనియన్​ బ్యాంక్​- బై రూ. 298.95, స్టాప్​ లాస్​ రూ. 285, టార్గెట్​ రూ. 327

హొనాసా కన్జ్యూమర్​- బై రూ. 277, స్టాప్​ లాస్​ రూ. 265, టార్గెట్​ రూ. 299

ఎన్​టీపీసీ గ్రీన్​ ఎనర్జీ- బై రూ. 95.04, స్టాప్​ లాస్​ రూ. 91.96, టార్గెట్​ రూ. 101.5

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More