గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 82,566 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 76 పాయింట్లు వృద్ధిచెంది 25,419 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 359 పాయింట్లు పెరిగి 59,958 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 481.83 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,772.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్ పరంగా నిఫ్టీ50 హవర్లీ చార్ట్‌లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ పాటర్న్ ఏర్పడింది. ఇది బుల్లిష్ రివర్సల్‌కి చిహ్నం. 25,200- 25,150 లెవల్స్ వద్ద నిఫ్టీ50కి సపోర్ట్ ఉంది. 25,500- 25,580 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాడితే సూచీ మరింత పెరగొచ్చు,” అని ఏంజెల్ వన్‌కి చెందిన చీఫ్ మేనేజర్- టెక్నికల్ అండ్ డెరివేటివ్ రీసెర్చ్ ఎనలిస్ట్ ఓషో కృషన్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.11 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.13శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.72 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఎంసీఎక్స్- బై రూ. 2686, స్టాప్ లాస్ రూ. 2590, టార్గెట్ రూ. 2880
కరూర్ వైశ్యా బ్యాంక్- బై రూ. 302, స్టాప్ లాస్ రూ. 292, టార్గెట్ రూ. 322
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- బై రూ. 180, స్టాప్ లాస్ రూ. 173, టార్గెట్ రూ. 192
బీఎస్ఈ- బై రూ. 2867, స్టాప్ లాస్ రూ. 2770, టార్గెట్ రూ. 3050
ఎయిర్టెల్- బై రూ. 1969, స్టాప్ లాస్ రూ. 1930, టార్గెట్ రూ. 2070
హీరో మోటోకార్ప్- బై రూ. 5580, స్టాప్ లాస్ రూ. 5480, టార్గెట్ రూ. 5820
సంవర్ధన మథర్సన్- బై రూ. 113.85, స్టాప్ లాస్ రూ. 110, టార్గెట్ రూ. 122
టోరెంట్ పవర్- బై రూ. 1371, స్టాప్ లాస్ రూ. 1342, టార్గెట్ రూ. 1440