జనవరి 30 : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​..

జనవరి 30, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 30, 2026, 08:15:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 222 పాయింట్లు పెరిగి 82,566 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 76 పాయింట్లు వృద్ధిచెంది 25,419 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 359 పాయింట్లు పెరిగి 59,958 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 481.83 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,772.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“టెక్నికల్​ పరంగా నిఫ్టీ50 హవర్లీ చార్ట్​లో ఇన్వర్టెడ్​ హెడ్​ అండ్​ షోల్డర్​ పాటర్న్​ ఏర్పడింది. ఇది బుల్లిష్​ రివర్సల్​కి చిహ్నం. 25,200- 25,150 లెవల్స్​ వద్ద నిఫ్టీ50కి సపోర్ట్​ ఉంది. 25,500- 25,580 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాడితే సూచీ మరింత పెరగొచ్చు,” అని ఏంజెల్​ వన్​కి చెందిన చీఫ్​ మేనేజర్​- టెక్నికల్​ అండ్​ డెరివేటివ్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ ఓషో కృషన్​ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.11 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.13శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.72 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఎంసీఎక్స్​- బై రూ. 2686, స్టాప్​ లాస్​ రూ. 2590, టార్గెట్​ రూ. 2880

కరూర్​ వైశ్యా బ్యాంక్​- బై రూ. 302, స్టాప్​ లాస్​ రూ. 292, టార్గెట్​ రూ. 322

యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 180, స్టాప్​ లాస్​ రూ. 173, టార్గెట్​ రూ. 192

బీఎస్​ఈ- బై రూ. 2867, స్టాప్​ లాస్​ రూ. 2770, టార్గెట్​ రూ. 3050

ఎయిర్​టెల్​- బై రూ. 1969, స్టాప్​ లాస్​ రూ. 1930, టార్గెట్​ రూ. 2070

హీరో మోటోకార్ప్​- బై రూ. 5580, స్టాప్​ లాస్​ రూ. 5480, టార్గెట్​ రూ. 5820

సంవర్ధన మథర్​సన్​- బై రూ. 113.85, స్టాప్​ లాస్​ రూ. 110, టార్గెట్​ రూ. 122

టోరెంట్​ పవర్​- బై రూ. 1371, స్టాప్​ లాస్​ రూ. 1342, టార్గెట్​ రూ. 1440

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More