Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- ఈ 8 స్టాక్స్‌లో ట్రేడ్‌తో లాభాలకు ఛాన్స్!
Stock market updates : జూన్ 30, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 372 పాయింట్లు పడి 76,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 110 పాయింట్లు కోల్పోయి 23,946 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్లు పడి 57,272 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,350.10 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,801.45 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 24,250 లెల్స్ దాటికే బయ్యర్లకు మరింత కన్విక్షన్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి సూచీ 24,400- 24,600 లెవల్స్ వరకు వెళ్లొచ్చు. 200 డీఎంఏ ఉన్న 23,850 జోన్ మాత్రం నిఫ్టీ50కి కీలక సపోర్ట్‌గా మారింది,” అని ప్రభుదాస్ లిల్లధేర్కి చెందిన వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్ రీసెర్చ్ వైశాలి పరేఖ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.59 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.18శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.07 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
ముడి చమురు ధరలు పడ్డాయి. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1.03శాతం పడి బ్యారెల్‌కి 72.40 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఎంసీఎక్స్- బై రూ. 2930, స్టాప్ లాస్ రూ. 2880, టార్గెట్ రూ. 3020
ఐఈఎక్స్- బై రూ. 125, స్టాప్ లాస్ రూ. 122, టార్గెట రూ. 130
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ- బై రూ. 583, స్టాప్ లాస్ రూ. 573, టార్గెట్ రూ. 600
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఇండియా గ్లైకోల్స్- బై రూ. 980, స్టాప్ లాస్ రూ. 935, టార్గెట్ రూ. 1070
భారత్ ఫోర్జ్- బై రూ. 2170, స్టాప్ లాస్ రూ. 2080, టార్గెట్ రూ. 2370
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 11545, స్టాప్ లాస్ రూ. 1100, టార్గెట్ రూ. 1290
గేబ్రియల్ ఇండియా- బై రూ. 1275, స్టాప్ లాస్ రూ. 1205, టార్గెట్ రూ. 1425
ఏఐఏ ఇంజినీరింగ్- బై రూ. 4950, స్టాప్ లాస్ రూ. 4750, టార్గెట్ రూ. 5350
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


