మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 20 పాయింట్లు పడి 84,675 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 3 పాయింట్లు కోల్పోయి 25,939 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 239 పాయింట్లు పెరిగి 59,171 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,860.90 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,236.10 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 30,769.1 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 72,936.56 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“మిడిల్ బొలింజర్ బ్యాండ్, బేరిష్ ఆర్ఎస్ఐ క్రాసోవర్, 21ఈఎంఏ వంటి ఇండేకటర్లు నిఫ్టీ50లో షార్ట్ టర్మ్ నెగిటివిటీని సూచిస్తున్నాయి. 25,850- 25870 జోన్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్ అయితే సూచీ మరింత బేరిష్ మారవచ్చు. 26,000 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.2 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.1శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.2 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.2 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.1శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.2 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
- రిపబ్లిక్ డే నుంచి క్రిస్మస్ వరకు- 2026లో స్టాక్ మార్కెట్ హాలీడే లిస్ట్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జిందాల్ స్టీల్ లిమిటెడ్- బై రూ. 1021.3, స్టాప్ లాస్ రూ. 985, టార్గెట్ రూ. 1093
రాజికో ఖైతాన్ లిమిటెడ్- బై రూ. 3376, స్టాప్ లాస్ రూ. 3257, టార్గెట్ రూ. 3615
ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్- బై రూ. 809, స్టాప్ లాస్ రూ. 780, టార్గెట్రూ.. 865
అదానీ పవర్ లిమిటెడ్- బై రూ. 144.65, స్టాప్ లాస్ రూ. 139, టార్గెట్ రూ. 156
గోదావరి పవర్ అండ్ ఇస్ఫాట్ లిమిటెడ్- బై రూ. 263.55, స్టాప్ లాస్ రూ. 254, టార్గెట్ రూ. 285