డిసెంబర్ 5 : ట్రేడర్స్ అలర్ట్! ఈ రూ. 152 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్..
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 158 పాయింట్లు పెరిగి 85,265 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 48 పాయింట్లు పెరిగి 26,034 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 60 పాయింట్లు పడి 59,289 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,681.46 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,188.04 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్స్ గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ50కి 26100- 26150 లెవల్స్ నిఫ్టీ50కి కీలక రెసిస్టెన్స్‌గా ఉంటుంది. 25,900- 25,950 వద్ద సపోర్ట్ ఉంది. 26,000 దిగువకు పడితే సూచీలో కరెక్షన్ కనిపించవచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.07 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.11శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.22 శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
కొఫోర్డ్ లిమిటెడ్- బై రూ. 1966, స్టాప్ లాస్ రూ. 1900, టార్గెట్ రూ. 2100
జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్- బై రూ. 474, స్టాప్ లాస్ రూ. 457, టార్గెట్ రూ. 508
యాక్సిస్ బ్యాంక్- బై రూ. 1280, స్టాప్ లాస్ రూ. 1260, టార్గెట్ రూ. 1320
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- బై రూ. 152, స్టాప్ లాస్ రూ .146, టార్గెట్ రూ. 162
డీఎల్ఎఫ్- బై రూ. 709, స్టాప్ లాస్ రూ. 700, టార్గెట్ రూ. 740
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
హెక్సావేర్ టెక్నాలజీస్: రూ .788.55 వద్ద కొనండి, టార్గెట్ రూ .865, స్టాప్ లాస్ రూ .750;
ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్: రూ .4685.10 వద్ద కొనండి, లక్ష్యం రూ .5050, స్టాప్ లాస్ రూ .4500;
జెబి కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్: రూ .1821.70 వద్ద కొనండి, లక్ష్యం రూ .1945, స్టాప్ లాస్ రూ .1760;
హిమాద్రి స్పెషాలిటీ కెమికల్: రూ .462.35 వద్ద కొనండి, టార్గెట్ రూ .497, స్టాప్ లాస్ రూ .445;
బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్: రూ .331.55 వద్ద కొనండి, లక్ష్యం రూ .358, స్టాప్ లాస్ రూ .318.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


