ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ప్రకటన నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 447 పాయింట్లు పెరిగి 85,712 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 153 పాయింట్లు వృద్ధిచెంది 26,186 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 488 పాయింట్లు పెరిగి 59,777 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 438.9 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,189.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 10403.62 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 19,785.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 షార్ట్ టర్మ్ ట్రెండ్ బలంగా ఉంది! సూచీ 26,300- 26,440 వరకు వెళ్లొచ్చు. 26,060- 26,000 లెవల్స్ వద్ద సపోర్ట్ ఉంది, సూచీ 26000 కన్నా ఎగువన ఉన్నంత వరకు బై-ఆన్- డిప్స్ స్ట్రాటజీని అనుసరించవచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.2 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.2శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.3 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}గోద్రేజ్ ప్రాపర్టీస్- బై రూ. 2082, స్టాప్ లాస్ రూ. 2040, టార్గెట్ రూ. 2200
ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్- బై రూ. 885, స్టాప్ లాస్ రూ. 860, టార్గెట్ రూ. 920
యునైటెడ్ స్పిరిట్స్- బై రూ. 1455, స్టాప్ లాస్ రూ. 1430, టార్గెట్ రూ. 1500
ఎల్ అండ్ టీ ఫైనాన్స్- బై రూ. 309.6, స్టాప్ లాస్ రూ. 302, టార్గెట్ రూ. 325
డీరెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- బై రూ. 880, స్టాప్ లాస్ రూ. 860, టార్గెట్ రూ. 940
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్: రూ .2837 వద్ద కొనండి, టార్గెట్ రూ .3040, స్టాప్ లాస్ రూ .2727;
నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్: రూ .3032 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ .3280, స్టాప్ లాస్ రూ .2940;
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్: రూ .367 వద్ద కొనండి, టార్గెట్ రూ .393, స్టాప్ లాస్ రూ .354;
చోళమండలం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫిన్ కో: రూ .1730 వద్ద కొనండి, లక్ష్యం రూ .1850, స్టాప్ లాస్ రూ .1670;
స్టైలం ఇండస్ట్రీస్: రూ .2147 వద్ద కొనండి, రూ .2300 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .2080.