Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఐటీసీ, ఎయిర్​టెల్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​..

ఫిబ్రవరి 9, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 9, 2026, 08:16:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 266 పాయింట్లు పెరిగి 83,580 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 51 పాయింట్లు వృద్ధిచెంది 25,694 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 60,121 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,950.77 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,265.06 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఫిబ్రవరి​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 2,645.53 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,892.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 215 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఉండటం ఈ గ్యాప్​ ఆప్​కి కారణం.

“ఇంట్రాడేలో మార్కెట్​ వీక్​గా కనిపిస్తోంది. 25,600 దిగువకు నిఫ్టీ50 పడితే మరింత సెల్లాఫ్​ కనిపించవచ్చు. అక్కడి నుంచి 25,500కి కూడా వెళ్లొచ్చు. కాగా, 25,800 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే సూచీ 25,900- 25,925కి కూడా వెళుతుంది,” అని కొటాక్​ సెక్యూరిటీస్​ ఈక్విటీ రీసెర్చ్​ హెడ్​ శ్రీకాంత్​ చౌహాన్​ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 2.4 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.97శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.18 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్​ సూచీలి రికార్డు గరిష్ఠాలకు చేరాయి.

స్టాక్స్​ టు బై..

టొరంట్​ ఫార్మా- బై రూ. 1429, స్టాప్​ లాస్​ రూ. 1377, టార్గెట్​ రూ. 1530

జిందాల్​ స్టీల్​- బై రూ. 1189.90, స్టాప్​ లాస్​ రూ. 1147, టార్గెట్​ రూ. 1275

ఐటీసీ- బై రూ. 326, స్టాప్​ లాస్​ రూ. 314, టార్గెట్​ రూ. 342

ఎయిర్​టెల్​- బై రూ. 2038, స్టాప్​ లాస్​ రూ. 2010, టార్గెట్​ రూ. 2100

కొటాక్​ మహీంద్రా బ్యాంక్​- బై రూ. 422, స్టాప్​ లాస్​ రూ. 410, టార్గెట్​ రూ. 460

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఐడీబీఐ బ్యాంక్​- బై రూ. 106.89, స్టాప్​ లాస్​ రూ. 102.5, టార్గెట్​ రూ. 115

శార్దా క్రాప్​కెమ్​- బై రూ. 1192, స్టాప్​ లాస్​ రూ. 1147, టార్గెట్​ రూ. 1285

నవీన్​ ఫ్లోరిన్​- బై రూ. 6417, స్టాప్​ లాస్​ రూ. 6200, టార్గెట్​ రూ. 6850

ఎస్కార్ట్స్​- బై రూ. 3763, స్టాప్​ లాస్​ రూ. 3630, టార్గెట్​ రూ. 4000

కర్రారో ఇండియా- బై రూ. 547, స్టాప్​ లాస్​ రూ. 530, టార్గెట్​ రూ. 590

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More