ట్రేడర్స్ అలర్ట్- ఇన్ఫోసిస్‌లో ట్రేడ్‌తో లాభాలకు ఛాన్స్! షేర్ ప్రైజ్ టార్గెట్..
జనవరి 9, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 780 పాయింట్లు పడి 84,181 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 264 పాయింట్లు కోల్పోయి 25,877 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 304 పాయింట్లు పెరిగి 59,686 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,367.12 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,701.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 8017.51 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,307.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 26,000- 26,050 వద్ద రెసిస్టెన్స్ ఉంది. 25,700- 25,750 వద్ద సపోర్ట్ ఉంది,” అని చాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమిత్ బగాడియా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.55 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.01శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.44 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఏఐఏ ఇంజినీరింగ్ లిమిటెడ్- బై రూ. 4075, స్టాప్ లాస్ రూ. 3930, టార్గెట్ రూ. 4365
ఇండియా సిమెంట్స్- బై రూ. 471, స్టాప్ లాస్ రూ. 455, టార్గెట్ రూ. 503
డా. రెడ్డీస్ లేబొరేటరీస్- బై రూ. 1206, స్టాప్ లాస్ రూ. 1190, టార్గెట్ రూ. 1260
ఇన్ఫోసిస్- బై రూ. 1612, స్టాప్ లాస్ రూ. 1580, టార్గెట్ రూ. 1660
కేఫిన్ టెక్నాలజీస్- బై రూ. 1065, స్టాప్ లాస్ రూ. 1050, టార్గెట్ రూ. 1110
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఐనాక్స్ ఇండియా- బై రూ. 1162.5, స్టాప్ లాస్ రూ. 1121, టార్గెట్ రూ. 1250
రామ్‌కో సిమెంట్స్- బై రూ. 1082.5, స్టాప్ లాస్ రూ. 1044, టార్గెట్ రూ. 1160
నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా- బై రూ. 3397, స్టాప్ లాస్ రూ. 3278, టార్గెట్ రూ. 3635
శోభ- బై రూ. 1570.1, స్టాప్ లాస్ రూ. 1515, టార్గెట్ రూ. 1680
వన్‌సోర్స్ స్పెషాలిటీ ఫార్మా- బై రూ. 1785.9, స్టాప్ లాస్ రూ. 1723, టార్గెట్ రూ. 1911














