సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 40 పాయింట్లు పెరిగి 83,978 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 41 పాయింట్లు వృద్ధిచెంది 25,763 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 325 పాయింట్లు పెరిగి 58,101 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,686.55 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,273.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,850, 25,900-26,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 25,600- 25,650 దగ్గర సపోర్ట్ ఉంది,” అని ఛాయిస్ ఈక్వీటీ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన టెక్నికిల్ అండ్ డెరివేటివ్ ఎనలిస్ట్ అమృత శిందే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.48 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.17శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.46 శాతం డౌన్ వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్- బై రూ. 683, స్టాప్ లాస్ రూ. 660, టార్గెట్ రూ. 740
{{/usCountry}}ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్- బై రూ. 683, స్టాప్ లాస్ రూ. 660, టార్గెట్ రూ. 740
{{/usCountry}}బజాజ్ కన్జ్యూమర్ కేర్- బై రూ. 286, స్టాప్ లాస్ రూ. 275, టార్గెట్ రూ. 310
ఇన్ఫోసిస్- బై రూ. 1486, స్టాప్ లాస్ రూ. 1465, టార్గెట్ రూ. 1530
బజాజ్ ఫైనాన్స్- బై రూ. 1045, స్టాప్ లాస్ రూ. 1020, టార్గెట్ రూ. 1090
ఎన్టీపీసీ- బై రూ. 335, స్టాప్ లాస్ రూ. 330, టార్గెట్ రూ. 345
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
పీడీఎస్: రూ .378 వద్ద కొనండి, లక్ష్యం రూ .410, స్టాప్ లాస్ రూ .365;
జోటా హెల్త్ కేర్: రూ.1575, టార్గెట్ రూ.1700, స్టాప్ లాస్ రూ.1520;
రెమ్సన్స్ ఇండస్ట్రీస్: రూ .150.25 వద్ద కొనండి, టార్గెట్ రూ .162, స్టాప్ లాస్ రూ .144;
అకుటాస్ కెమికల్స్: రూ .1810 వద్ద కొనండి, లక్ష్యం రూ .1940, స్టాప్ లాస్ రూ .1745;
విజయ డయాగ్నొస్టిక్ సెంటర్: రూ.1020 వద్ద కొనండి, టార్గెట్ రూ.1100, స్టాప్ లాస్ రూ.980.