ట్రేడర్స్​ అలర్ట్​- ఇన్ఫోసిస్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 4, 2025, 08:15:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 40 పాయింట్లు పెరిగి 83,978 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 41 పాయింట్లు వృద్ధిచెంది 25,763 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 325 పాయింట్లు పెరిగి 58,101 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,686.55 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,273.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 25,850, 25,900-26,000 దగ్గర రెసిస్టెన్స్​ ఉంది. 25,600- 25,650 దగ్గర సపోర్ట్​ ఉంది,” అని ఛాయిస్​ ఈక్వీటీ బ్రోకింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్​కి చెందిన టెక్నికిల్​ అండ్​ డెరివేటివ్​ ఎనలిస్ట్​ అమృత శిందే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.48 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.17శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.46 శాతం డౌన్​ వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఎలైడ్​ బ్లెండర్స్​ అండ్​ డిస్టిల్లర్స్​- బై రూ. 683, స్టాప్​ లాస్​ రూ. 660, టార్గెట్​ రూ. 740

బజాజ్​ కన్జ్యూమర్​ కేర్​- బై రూ. 286, స్టాప్​ లాస్​ రూ. 275, టార్గెట్​ రూ. 310

ఇన్ఫోసిస్​- బై రూ. 1486, స్టాప్​ లాస్​ రూ. 1465, టార్గెట్​ రూ. 1530

బజాజ్​ ఫైనాన్స్​- బై రూ. 1045, స్టాప్​ లాస్​ రూ. 1020, టార్గెట్​ రూ. 1090

ఎన్​టీపీసీ- బై రూ. 335, స్టాప్​ లాస్​ రూ. 330, టార్గెట్​ రూ. 345

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

పీడీఎస్: రూ .378 వద్ద కొనండి, లక్ష్యం రూ .410, స్టాప్ లాస్ రూ .365;

జోటా హెల్త్ కేర్: రూ.1575, టార్గెట్ రూ.1700, స్టాప్ లాస్ రూ.1520;

రెమ్సన్స్ ఇండస్ట్రీస్: రూ .150.25 వద్ద కొనండి, టార్గెట్ రూ .162, స్టాప్ లాస్ రూ .144;

అకుటాస్ కెమికల్స్: రూ .1810 వద్ద కొనండి, లక్ష్యం రూ .1940, స్టాప్ లాస్ రూ .1745;

విజయ డయాగ్నొస్టిక్ సెంటర్: రూ.1020 వద్ద కొనండి, టార్గెట్ రూ.1100, స్టాప్ లాస్ రూ.980.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More