గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 398 పాయింట్లు పెరిగి 82,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 132 పాయింట్లు వృద్ధిచెంది 25,290 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 59,200 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,549.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,222.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 36,591.01 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 50,720.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,120 వద్ద బలమైన సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అవ్వనంతవరకు సూచీ 25,400- 25,500 వరకు వెళ్లొచ్చు. నిఫ్టీ50 25,600 దాటితే బుల్లిష్‌గా మారే అవకాశం ఉంది,” అని ఎన్రిచ్ మనీ సీఈఓ ఆర్ పొన్ముడి తెలిపారు.
బడ్జెట్ 2026: రియల్ ఎస్టేట్ రంగం ఆశలేంటి? ఇన్‌ఫ్రా, మెట్రో కనెక్టివిటీ
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.63 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.5శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.9 శాతం పెరిగింది.
{{/usCountry}}గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.63 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.5శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.9 శాతం పెరిగింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
సెయిల్- బై రూ. 151.65, స్టాప్ లాస్ రూ. 146, టార్గెట్ రూ. 163
జేకే టైర్- బై రూ. 520, స్టాప్ లాస్ రూ. 502, టార్గెట్ రూ. 556
డీఎల్ఎఫ్- బై రూ. 613, స్టాప్ లాస్ రూ. 600, టార్గెట్ రూ. 642
ఎటర్నల్- బై రూ. 275, స్టాప్ లాస్ రూ. 260, టార్గెట్ రూ. 310
హెచ్ఏఎల్- బై రూ. 4355, స్టాప్ లాస్ రూ. 4260, టార్గెట్ రూ. 4550
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఏపీఎల్ అపోలో ట్యూబ్స్- బై రూ. 1976, స్టాప్ లాస్ రూ. 1885, టార్గెట్ రూ. 2150
అశోక్ లేల్యాండ్- బై రూ. 190.28, స్టాప్ లాస్ రూ. 181, టార్గెట్ రూ. 207
ఫెడరల్ బ్యాంక్- బై రూ. 282.2, స్టాప్ లాస్ రూ. 268, టార్గెట్ రూ. 308
నెస్లే ఇండియా- బై రూ. 1306, స్టాప్ లాస్ రూ. 1260, టార్గెట్ రూ. 1394
క్యాంపస్ యాక్టివ్‌వేర్- బై రూ. 254.8, స్టాప్ లాస్ రూ. 245, టార్గెట్ రూ. 272