ట్రేడర్స్​ అలర్ట్​- పేటీఎం స్టాక్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

డిసెంబర్​ 9, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 9, 2025, 07:30:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 610 పాయింట్లు పడి 85,103 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 226 పాయింట్లు కోల్పోయి 25,961 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 539 పాయింట్లు పడి 59,238 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 655.59 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,542.49 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 11,059.21 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 22,327.99 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ షార్ట్​ టర్మ్​ సెంటిమెంట్​ బలహీనంగా మారింది. నిఫ్టీ50 25,730 వరకు వెళ్లొచ్చు. 26,000- 26,100 లెవల్స్​ దగ్గర బలమైన రెసిస్టెన్స్​ ఉంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.45 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.35శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.14 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

కాన్​ ఫిన్​ హోమ్స్​- బై రూ. 913, స్టాప్​ లాస్​ రూ. 881, టార్గెట్​ రూ. 977

పీబీ ఫిన్​టెక్​- బై రూ. 1914, స్టాప్​ లాస్​ రూ. 1850, టార్గెట్​ రూ. 2042

పేటీఎం- బై రూ. 1320, స్టాప్​ లాస్​ రూ. 1280, టార్గెట్​ రూ. 1360

యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 150, స్టాప్​ లాస్​ రూ. 146, టార్గెట్​ రూ. 162

కేఫిన్​ టెక్నాలజీస్​- బై రూ. 1040, స్టాప్​ లాస్​ రూ. 1015, టార్గెట్​ రూ. 1115

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

లేటెంట్ వ్యూ అనలిటిక్స్: రూ .497 వద్ద కొనండి, లక్ష్యం రూ .535, స్టాప్ లాస్ రూ .480;

కాంటాబిల్ రిటైల్ ఇండియా లిమిటెడ్: రూ .268 వద్ద కొనండి, టార్గెట్ రూ .288, స్టాప్ లాస్ రూ .259;

గుజరాత్ అంబుజా ఎక్స్ పోర్ట్స్: రూ .118.2 వద్ద కొనండి, టార్గెట్ రూ .127, స్టాప్ లాస్ రూ .114;

వీనస్ రెమెడీస్: రూ .762 వద్ద కొనండి, టార్గెట్ రూ .820, స్టాప్ లాస్ రూ .733;

జిందాల్ స్టెయిన్లెస్: రూ .766 వద్ద కొనండి, లక్ష్యం రూ .820, స్టాప్ లాస్ రూ .740.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More