Stocks to buy today : ఈ రోజు ఈ 3 స్టాక్స్‌లో ట్రేడ్‌తో లాభాలకు ఛాన్స్!
ఫిబ్రవరి 13, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 559 పాయింట్లు పడి 83,675 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 147పాయింట్లు కోల్పోయి 25,807 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కేవలం 6 పాయింట్లు పడి 60,740 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 108.42 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 276.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 6,021.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,221.99 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 140 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ ఛార్ట్‌లో లోయర్ షాడోతో కూడిన నెగిటివ్ క్యాండిల్ ఏర్పడింది. ఇది కింది వైపునకు షార్ట్ టర్మ్ కరెక్షన్‌ని సూచిస్తుంది. కానీ మొత్తం మీద చూస్తే నిఫ్టీ50 ట్రెండ్ ఇంకా పాజిటివ్‌గానే ఉంది. ప్రస్తుతం ఉన్న షార్ట్ టర్మ్ కరెక్షన్ ఎక్కువ కాలం ఉండకపోవ్చచు. 25,600 లెవల్ సపోర్ట్‌గా ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.3 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.5శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.03 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
కెమ్‌ప్లాస్ట్- బై రూ. 333.90, స్టాప్ లాస్ రూ. 311, టార్గెట్ రూ. 380
బీఈఎల్- బై రూ. 443.90, స్టాప్ లాస్ రూ. 428, టార్గెట్ రూ. 485
కిమ్స్- బై రూ. 700, స్టాప్ లాస్ రూ. 665, టార్గెట్ రూ. 780

E-Paper












