బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 347 పాయింట్లు పెరిగి 77,156 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 97 పాయింట్లు వృద్ధిచెంది 24,086 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 57,585 వద్దకు చేరింది.

కాగా.. ఓవైపు అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం, మరోవైపు ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాల వేళ ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 101.59 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,561.40 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 11 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ ఛార్ట్‌లో మైనర్ అప్పర్, లోయర్ షాడోలతో కూడిన చిన్న బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. ఇది రేంజ్ బౌండ్కి సంకేతం. 24,100 లెవల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సూచీ 24,500కి వెళ్లొచ్చు. మరోవైపు 23,900 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.98 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.21శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.34 శాతం డౌన్ అయ్యింది.
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, ద్రవ్యోల్బణం కారణంగా రానున్న రోజుల్లో రేట్ హైక్ ఉండొచ్చన్న సంకేతాలు ఫెడ్ నుంచి అందడమే ఈ నష్టాలకు కారణం. అమెరికా ఫెడ్ మీటింగ్ ఔట్‌పుట్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
{{/usCountry}}వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, ద్రవ్యోల్బణం కారణంగా రానున్న రోజుల్లో రేట్ హైక్ ఉండొచ్చన్న సంకేతాలు ఫెడ్ నుంచి అందడమే ఈ నష్టాలకు కారణం. అమెరికా ఫెడ్ మీటింగ్ ఔట్‌పుట్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం సంతకం చేశానని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ముడి చమురు ధర పతనమైంది. బ్రెంట్ క్రూడ్ 1.12శాతం పడి బ్యారెల్‌కి 78.66 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
వీ-మార్ట్ రీటైల్- బై రూ. 764, స్టాప్ లాస్ రూ. 723, టార్గెట్ రూ. 825
విషాల్ మెగా మార్ట్- బై రూ. 119, స్టాప్ లాస్ రూ. 116, టార్గెట్ రూ. 125
ఔరబిందో ఫార్మా- బై రూ. 1423, స్టాప్ లాస్ రూ. 1440, టార్గెట్ రూ. 1460
ఎస్బీఐ- బై రూ. 1025, స్టాప్ లాస్ రూ. 1888, టార్గెట్ రూ. 2150
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జీఎన్ఎఫ్సీ- బై రూ. 559, స్టాప్ లాస్ రూ. 535, టార్గెట్ రూ. 600
కేఈఐ ఇండస్ట్రీస్- బై రూ. 5643, స్టాప్ లాస్ రూ. 5345, టార్గెట్ రూ. 6180
కేఫిన్ టెక్నాలజీస్- బై రూ. 898, స్టాప్ లాస్ రూ. 860, టార్గెట్ రూ. 985
ఎన్బీసీసీ- బై రూ. 112.80, స్టాప్ లాస్ రూ. 107, టార్గెట్ రూ. 124
కజారియా సెరమిక్స్- బై రూ. 1156, స్టాప్ లాస్ రూ. 1100, టార్గెట్ రూ. 1270