Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ 8 స్టాక్స్​తో ఈరోజు లాభాలకు ఛాన్స్​!

మార్చ్​ 18, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 18, 2026, 08:15:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 568 పాయింట్లు పెరిగి 76,071 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 172 పాయింట్లు వృద్ధిచెంది 23,581 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 463 పాయింట్లు పెరిగి 54,876 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,741.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,225.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 23,350- 23,300 కీలక సపోర్ట్​ జోన్​గా ఉంది. పుల్​ బ్యాక్​ అయితే సూచీ 23,800కి, అక్కడి నుంచి 23,950 వరకు వెళ్లొచ్చు,” అని కొటాక్​ సెక్యూరిటీస్​ వెల్లడించింది.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.10 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.25శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.4 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధరలు..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్​ క్రూడ్​ 1.1శాతం పడి బ్యారెల్​కి 102.27కి చేరింది.

స్టాక్స్​ టు బై..

వర్ధమాన్​ టెక్స్​టైల్స్​- బై రూ. 554, స్టాప్​ లాస్​ రూ. 535, టార్గెట్​ రూ. 592

చంబల్​ ఫర్టిలైజర్స్​- బై రూ. 429, స్టాప్​ లాస్​ రూ. 414, టార్గెట్​ రూ. 460

ఏషియన్​ పెయింట్స్​- బై రూ. 2328, స్టాప్​ లాస్​ రూ. 2280, టార్గెట్​ రూ. 2380

పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​- బై రూ. 298, స్టాప్​ లాస్​ రూ. 293, టార్గెట్​ రూ. 312

ఔరబిందో ఫార్మా- బై రూ. 1285, స్టాప్​ లాస్​ రూ. 1260, టార్గెట్​ రూ. 1330

టీడీ పవర్​ సిస్టెమ్స్​- బై రూ. 817, స్టాప్​ లాస్​ రూ. 800, టార్గెట్​ రూ. 855

బీఎస్​ఈ- బై రూ. 2973, స్టాప్​ లాస్​ రూ. 2915, టార్గెట్​ రూ. 3120

నెట్​వెబ్​ టెక్నాలజీస్​- బై రూ. 3304, స్టాప్​ లాస్​ రూ. 3240, టార్గెట్​ రూ. 3450

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More