ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 120 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్..
నవంబర్ 21, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 446 పాయింట్లు పెరిగి 85,633 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు వృద్ధిచెంది 26,192 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 59,348 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 283.65 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 824.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 12,074.94 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 51,159.55 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 26,100 ఎగువన ఉన్నంత వరకు సూచీలో పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగుతుంది. దాని దిగువకు పడితే షార్ట్ టర్మ్‌లో నెగిటివ్‌గా మారుతుంది. 25,900 వరకు సూచీ వెళ్లొచ్చు. 26,100 పైన ఉన్నంత కాలం నిఫ్టీ50 26,300- ఆ తర్వాతి స్థాయిలకు చేరొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.84 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.56శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.15 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
మాన్ ఇండస్ట్రీస్- బై రూ. 464, స్టాప్ లాస్ రూ. 448, టార్గెట్ రూ. 500
ఎంటార్ టెక్నాలజీస్- బై రూ. 2696, స్టాప్ లాస్ రూ. 2600, టార్గెట్ రూ. 2900
ఐఈఎక్స్- బై రూ. 142, స్టాప్ లాస్ రూ. 135, టార్గెట్ రూ. 150
కాన్కర్- బై రూ. 516, స్టాప్ లాస్ రూ. 500, టార్గెట్ రూ. 540
పీఎన్బీ- బై రూ. 123, స్టాప్ లాస్ రూ. 118, టార్గెట్ రూ. 128
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ (ఏఆర్ఎస్ఎస్బీఎల్): రూ.747 వద్ద కొనుగోలు చేయండి. టార్గెట్ ధర రూ.800; రూ. 720 వద్ద స్టాప్ లాస్.
అనుపమ్ రసాయన్ ఇండియా లిమిటెడ్ (అనురాస్): రూ.1,188కు కొనుగోలు. టార్గెట్ ధర రూ.1,280; రూ.1,145 వద్ద స్టాప్ లాస్.
ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఆజాద్): రూ.1,740కు కొనుగోలు. టార్గెట్ ధర రూ.1,866; స్టాప్ లాస్ రూ .1,680 వద్ద ఉంది.
సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (సెనోర్స్): రూ.825కు కొనుగోలు చేయాలి. టార్గెట్ ధర రూ.888; రూ.799 వద్ద స్టాప్ లాస్.
పీడీఎస్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్): రూ.407కే కొనండి. టార్గెట్ ధర రూ.437; రూ. 392 వద్ద స్టాప్ లాస్.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


