సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 172 పాయింట్లు పడి 77,369 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 33 పాయింట్లు కోల్పోయి 24,219 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 236 పాయింట్లు పడి 57,526 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,181.66 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,493.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 2 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 24,150- 24,100 కీలక సోపర్ట్గా ఉంది. ఆ తర్వాత 24,050- 24,000 జోన్‌ని చూడవచ్చు. ఇక 24,300 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 24,500 వరకు వెళుతుంది,” అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.26 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.28శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.76 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షల వేళ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 0.66శాతం పెరిగి బ్యారెల్‌కి 92.8 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షల వేళ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 0.66శాతం పెరిగి బ్యారెల్‌కి 92.8 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}వెల్స్పన్ లివింగ్- బై రూ. 190.4, స్టాప్ లాస్ రూ. 184, టార్గెట్ రూ. 204
రెడింగ్టన్- బై రూ. 365, స్టాప్ లాస్ రూ. 352, టార్గెట్ రూ. 390
ఎల్‌టీఎం- బై రూ. 4515, స్టాప్ లాస్ రూ. 4450, టార్గెట్ రూ. 4700
కామ్స్- బై రూ. 455, స్టాప్ లాస్ రూ. 435, టార్గెట్ రూ. 470
సిప్లా- బై రూ. 1435, స్టాప్ లాస్ రూ. 1420, టార్గెట్ రూ. 1465
హిందాల్కో ఇండస్ట్రీస్- బై రూ. 1058, స్టాప్ లాస్ రూ. 1035, టార్గెట్ రూ. 1120
నాల్కో ఇండస్ట్రీస్- బై రూ. 176, స్టాప్ లాస్ రూ. 172, టార్గెట్ రూ. 186
వీ-మార్ట్ రీటైల్ - బై రూ. 856, స్టాప్ లాస్ రూ. 836, టార్గెట్ రూ. 905