అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితి నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 983 పాయింట్లు పడి 76,681 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 275 పాయింట్లు కోల్పోయి 23,898 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 215 పాయింట్లు పడి 56,090 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8,828 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,701 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 185 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా భారత ఈక్విటీ మార్కెట్లు ఒడుదొడుకులకు గురయ్యే అవకాశం ఉంది. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ వద్ద సరఫరా అనిశ్చితి కారణంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్.. బ్యారెల్‌కి 105- 108 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లను ఇబ్బంది పెడుతున్న అంశం ఇదే,” అని ఎన్రిచ్ మనీ సీఈఓ ఆర్ పొన్ముడి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.16 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.80శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.6 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధర పెరుగుతూనే ఉంది. బ్రెంట్ క్రూడ్ తాజాగా 2.05శాతం పెరిగి బ్యారెల్‌కి 107.49 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
టాటా పవర్- బై రూ. 433, స్టాప్ లాస్ రూ. 425, టార్గెట్ రూ. 442
సెయిల్- బై రూ. 177, స్టాప్ లాస్ రూ. 174, టార్గెట్ రూ. 182
టీసీఐ- బై రూ. 942, స్టాప్ లాస్ రూ. 930, టార్గెట్ రూ. 965
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఇప్కా లేబొరేటరీస్- బై రూ. 1555.90, స్టాప్ లాస్ రూ. 1484, టార్గెట్ రూ. 1680
వరుణ్ బేవరేజెస్- బై రూ. 490.45, స్టాప్ లాస్ రూ. 467, టార్గెట్ రూ. 530
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- బై రూ. 77.9, స్టాప్ లాస్ రూ. 74.5, టార్గెట్ రూ. 84.5
టిటాగర్ రైల్ సిస్టెమ్స్- బై రూ. 756.2, స్టాప్ లాస్ రూ. 720, టార్గెట్ రూ. 824