శ్రీరామ నవమి నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు. ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1205 పాయింట్లు పెరిగి 75,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 394 పాయింట్లు వృద్ధిచెంది 23,306 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1102 పాయింట్లు పెరిగి 53,708 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,805.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,429.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 185 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,400- 23,600 లెవల్స్ వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే 23,850 వరకు వెళ్లొచ్చు. మరోవైపు 22,500 వద్ద సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.01 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.74శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.3 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల పైనే ఉంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 0.76శాతం పడి బ్యారెల్కు 107.19 డాలర్ల వద్ద ఉంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల పైనే ఉంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 0.76శాతం పడి బ్యారెల్కు 107.19 డాలర్ల వద్ద ఉంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}కర్ణాటక బ్యాంక్- బై రూ. 226.48, స్టాప్ లాస్ రూ. 218, టార్గెట్ రూ. 240
లుమాక్స్ ఆటో టెక్నాలజీస్- బై రూ. 1623, స్టాప్ లాస్ రూ. 1557, టార్గెట్ రూ. 1736
సైర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ- బై రూ. 817, స్టాప్ లాస్ రూ. 777, టార్గెట్ రూ. 880
గ్లెన్మార్క్ ఫార్మా- బై రూ. 2168, స్టాప్ లాస్ రూ. 2078, టార్గెట్ రూ. 2300
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ- బై రూ. 2168, స్టాప్ లాస్ రూ. 2078, టార్గెట్ రూ. 2300