Gift Nifty today : బక్రీద్ కారణంగా గురువారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 142 పాయింట్లు పడి 75,868 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 7 పాయింట్లు కోల్పోయి 23,907 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 239 పాయింట్లు పతనమై 54,854 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,042.70 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,821.00 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 కీలక 23,850- 24,000 లెవల్స్ మధ్య కన్సాలిడేట్ అవుతోంది. ఈ సపోర్ట్ కొనసాగడం కీలకం. పైన 24,000 దాటగలిగితే సూచీ రానున్న రోజుల్లో అక్కడి నుంచి 24,2000 24,400 లెవల్స్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది,” అని ప్రభుదాస్ లిల్లధేర్కి చెందిన వైస్ ప్రెసిడెంట్, టెక్నికలర్ రీసెర్చ్ ఎనలిస్ట్ వైశాలీ పరేఖ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.05 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.58శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.91 శాతం పెరిగింది.
మరోవైపు ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో చమురు ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ క్రూడ్ 0.5శాతం పడి బ్యారెల్‌కి 92.24కి చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో చమురు ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ క్రూడ్ 0.5శాతం పడి బ్యారెల్‌కి 92.24కి చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}జీఎంఆర్ పవర్- బై రూ. 108, స్టాప్ లాస్ రూ. 104, టార్గెట్ రూ. 118
పైన్ ల్యాబ్స్- బై రూ. 145, స్టాప్ లాస్ రూ. 140, టార్గెట్ రూ. 155
బీఎఫ్ యుటిలిటీస్- బై రూ. 570, స్టాప్ లాస్ రూ. 560, టార్గెట్ రూ. 600
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
వెల్స్పన్ కార్ప్- బై రూ. 1373, స్టాప్ లాస్ రూ. 1315, టార్గెట్ రూ. 1485
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ- బై రూ. 39.24, స్టాప్ లాస్ రూ. 37.35, టార్గెట్ రూ. 43
గ్రాన్యూల్స్ ఇండియా- బై రూ. 783, స్టాప్ లాస్ రూ. 747, టార్గెట్ రూ. 850
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 1053, స్టాప్ లాస్ రూ. 1000, టార్గెట్ రూ. 1135
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్- బై రూ. 71.48, స్టాప్ లాస్ రూ. 77.50, టార్గెట్ రూ .68.50