ట్రేడర్స్ అలర్ట్- మీ వాచ్‌లిస్ట్‌లో కచ్చితంగా ఉండాల్సిన 10 స్టాక్స్ ఇవి..
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 148 పాయింట్లు పడి 83,311 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 88 పాయింట్లు కోల్పోయి 25,510 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 273 పాయింట్లు పడి 57,554 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,263.21 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,283.91 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నవంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 6,214.00 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,003.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 130 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“కీలక 21ఈఎంఐ సపోర్ట్‌కి కిందకు నిఫ్టీ50 పడిపోయింది. అంటే సూచీలో బలం లేనట్టు! 25,450 దిగువకు కూడా పడిపోతే నిఫ్టీ50 షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగిటివ్‌గా మారినట్టు అవుతుంది. 24,450 ఎగువన ఉంటే ట్రెండ్ రివర్సెల్కి ఛాన్స్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.84 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.12శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.90 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
డాబర్ ఇండియా- బై రూ. 524, స్టాప్ లాస్ రూ. 506, టార్గెట్ రూ. 560
పీఐ ఇండస్ట్రీస్- బై రూ. 3750, స్టాప్ లాస్ రూ. 3620, టార్గెట్ రూ. 4010
ఎన్టీపీసీ- బై రూ. 326, స్టాప్ లాస్ రూ. 316, టార్గెట్ రూ. 342
బీఈఎల్- బై రూ. 408, స్టాప్ లాస్ రూ. 400, టార్గెట్ రూ. 430
మారుతీ సుజుకీ ఇండియా- బై రూ. 16450, స్టాప్ లాస్ రూ. 16000, టార్గెట్ రూ. 16800
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఆదిత్య ఇన్ఫోటెక్: రూ .1402 వద్ద కొనండి, లక్ష్యం రూ .1500, స్టాప్ లాస్ రూ .1350;
సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్: రూ .799 వద్ద కొనండి, లక్ష్యం రూ .860, స్టాప్ లాస్ రూ .770;
అట్లాంటా ఎలక్ట్రికల్స్: రూ .995 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ .1070, స్టాప్ లాస్ రూ .965;
ఆనంద్ రాఠి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్: రూ .539 వద్ద కొనండి, టార్గెట్ రూ .580, స్టాప్ లాస్ రూ .520;
సాకర్ హెల్త్‌కేర్: రూ.390 వద్ద కొనండి, టార్గెట్ రూ.420, స్టాప్ లాస్ రూ.375.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


