Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ బ్రేకౌట్ స్టాక్స్‌లో ట్రేడ్‌తో లాభాలకు ఛాన్స్..
Stock Market today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు లభించింది. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని సూచీలు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,636 పాయింట్లు పడి 71,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 488 పాయింట్లు కోల్పోయి 22,331 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1999 పాయింట్లు పడి 50,275 వద్దకు చేరింది.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గత నెల రోజులుగా ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు భారీ స్థాయిలో పడుతూనే ఉన్నాయి. కాగా యుద్ధం త్వరగా ముగిసిపోతుందని తాజాగా అందుతున్న సంకేతాల కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా లాభాల ర్యాలీ కనిపిస్తోంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 11,163.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 14,894.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ అతి భారీ లాబాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 445 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో వీక్నెస్ కనిపిస్తోంది. రివర్సల్‌కి ఇంకా సంకేతాలు కనిపించలేదు. సూచీ ఇక్కడి నుంచి 22,000- 21,900కి వెళ్లొచ్చు. 22,500 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 2.4 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 2.91 శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 3.8 శాతం పెరిగింది.
ఇదే ఊపులో ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 3.6శాతం లాభాల్లో ఉంది.
ముడి చమురు ధరలు..
ముడి చమురు ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 0.54శాతం పెరిగి బ్యారెల్‌కి 104.51 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మా- బై రూ. 2283, స్టాప్ లాస్ రూ. 2217, టార్గెట్ రూ. 2420
ఇప్కా ల్యాబ్స్- బై రూ. 1601.2, స్టాప్ లాస్ రూ. 1547, టార్గెట్ రూ. 1710
ఆర్‌హెచ్ ఐ మాగ్నెసిటా ఇండియా- బై రూ. 337.8, స్టాప్ లాస్ రూ. 323, టార్గెట్ రూ .275
సమ్మాన్ క్యాపిటల్- బై రూ. 149.5, స్టాప్ లాస్ రూ. 144.8, టార్గెట్ రూ. 160
కేఎస్బీ- బై రూ. 796.8, స్టాప్ లాస్ రూ. 774, టార్గెట్ రూ. 850
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


