బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 64 పాయింట్లు పెరిగి 73,983 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 27 పాయింట్లు కోల్పోయి 23,215 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 94 పాయింట్లు పడి 55,100 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో ప్రంపచ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,214.98 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,123.95 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 175 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“గత ట్రేడింగ్ సెషన్లో 23,450 కీలక జోన్‌ని నిఫ్టీ50 దాటలేకపోయింది. భారీ అప్పర్ షాడోతో డోజీ తరహా క్యాండిల్ని ఫార్మ్ చేసింది. ఇది ప్రాఫిట్ బుకింగ్‌కి సంకేదం. ఇప్పుడు సూచీ 23,450 దాటి 23,600 వరకు వెళ్లాలంటే.. ముందు 23,200 లెవల్ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి,” అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ హెడ్ డెరివేటివ్స్ అండే టెక్నికల్స్ చందన్ తపారియా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.8 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.6శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.9 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వద్ద మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఫలితంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ 2.47శాతం వృద్ధిచెంది బ్యారెల్‌కి 95.40 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఏబీఎస్ఎల్ఏఎంసీ- బై రూ. 1110, స్టాప్ లాస్ రూ. 1062, టార్గెట్ రూ. 1200
రెటిగెయిన్ ట్రావెల్- బై రూ. 783, స్టాప్ లాస్ రూ. 744, టార్గెట్ రూ. 850
మనోరమ ఇండస్ట్రీస్- బై రూ. 1540, స్టాప్ లాస్ రూ. 1490, టార్గెట్ రూ. 1650
రేయ్మాండ్- బై రూ. 553, స్టాప్ లాస్ రూ. 525, టార్గెట్ రూ. 600
సీసీఎల్ ప్రాడక్ట్స్- బై రూ. 1193, స్టాప్ లాస్ రూ. 1135, టార్గెట్ రూ .1290