...
...
Next Story

ట్రేడర్స్​ అలర్ట్​- NTPC, CDSL స్టాక్స్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..

నవంబర్​ 19, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 19, 2025, 08:15:11 IST
Advertisement

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 278 పాయింట్లు పడి 84,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 103 పాయింట్లు కోల్పోయి 25,910 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 63 పాయింట్లు పడి 58,899 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 728.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,156.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 13,939.31 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 48,974.82 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“హవర్లీ టైమ్​ఫ్రెమ్​లో ఆర్​ఎస్​ఐ బేరిష్​ క్రాసోవర్​కి సంకేతాలిస్తోంది. అంటే మార్కెట్​లో వీక్​నెస్​ కనిపిస్తున్నట్టు! 25,850 వద్ద సపోర్ట్​ ఉంది. దాని కన్నా తక్కువకు పడితే, సూచీ 25,700 వరకు కరెకట్​ అవ్వొచ్చు. ఇక 26,000- 26,050 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.07 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.83శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.21 శాతం డౌన్​ అయ్యింది.

అర్వింద్​ లిమిటెడ్​- బై రూ. 346, స్టాప్​ లాస్​ రూ. 333, టార్గెట్​ రూ. 370

గోకుల్​ ఆగ్రో రిసోర్సెస్​- బై రూ. 211, స్టాప్​ లాస్​ రూ. 203, టార్గెట్​ రూ. 226

సీడీఎస్​ఎల్​- బై రూ. 1605, స్టాప్​ లాస్​ రూ. 1509, టార్గెట్​ రూ. 1645

కేఫిన్​ టెక్నాలజీస్​- బై రూ. 1090, స్టాప్​ లాస్​ రూ. 1065, టార్గెట్​ రూ. 1125

ఎన్​టీపీసీ- బై రూ. 328, స్టాప్​ లాస్​ రూ. 320, టార్గెట్​ రూ. 345

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఫేజ్ త్రీ: రూ .546 వద్ద కొనండి, టార్గెట్ రూ .590, స్టాప్ లాస్ రూ .525;

సీక్వెంట్ సైంటిఫిక్: రూ .247 వద్ద కొనండి, టార్గెట్ రూ .265, స్టాప్ లాస్ రూ .238;

కంట్రోల్ ప్రింట్: రూ .773 వద్ద కొనండి, టార్గెట్ రూ .830, స్టాప్ లాస్ రూ .744;

ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్: రూ .773 వద్ద కొనండి, రూ .830 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .750;

సుప్రియా లైఫ్ సైన్స్: రూ .802 వద్ద కొనండి, టార్గెట్ రూ .865, స్టాప్ లాస్ రూ .770.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe