ట్రేడర్స్ అలర్ట్- NTPC, CDSL స్టాక్స్‌కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..
నవంబర్ 19, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 278 పాయింట్లు పడి 84,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 103 పాయింట్లు కోల్పోయి 25,910 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 63 పాయింట్లు పడి 58,899 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 728.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,156.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 13,939.31 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 48,974.82 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“హవర్లీ టైమ్ఫ్రెమ్లో ఆర్ఎస్ఐ బేరిష్ క్రాసోవర్కి సంకేతాలిస్తోంది. అంటే మార్కెట్లో వీక్నెస్ కనిపిస్తున్నట్టు! 25,850 వద్ద సపోర్ట్ ఉంది. దాని కన్నా తక్కువకు పడితే, సూచీ 25,700 వరకు కరెకట్ అవ్వొచ్చు. ఇక 26,000- 26,050 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.07 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.83శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.21 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
అర్వింద్ లిమిటెడ్- బై రూ. 346, స్టాప్ లాస్ రూ. 333, టార్గెట్ రూ. 370
గోకుల్ ఆగ్రో రిసోర్సెస్- బై రూ. 211, స్టాప్ లాస్ రూ. 203, టార్గెట్ రూ. 226
సీడీఎస్ఎల్- బై రూ. 1605, స్టాప్ లాస్ రూ. 1509, టార్గెట్ రూ. 1645
కేఫిన్ టెక్నాలజీస్- బై రూ. 1090, స్టాప్ లాస్ రూ. 1065, టార్గెట్ రూ. 1125
ఎన్టీపీసీ- బై రూ. 328, స్టాప్ లాస్ రూ. 320, టార్గెట్ రూ. 345
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఫేజ్ త్రీ: రూ .546 వద్ద కొనండి, టార్గెట్ రూ .590, స్టాప్ లాస్ రూ .525;
సీక్వెంట్ సైంటిఫిక్: రూ .247 వద్ద కొనండి, టార్గెట్ రూ .265, స్టాప్ లాస్ రూ .238;
కంట్రోల్ ప్రింట్: రూ .773 వద్ద కొనండి, టార్గెట్ రూ .830, స్టాప్ లాస్ రూ .744;
ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్: రూ .773 వద్ద కొనండి, రూ .830 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .750;
సుప్రియా లైఫ్ సైన్స్: రూ .802 వద్ద కొనండి, టార్గెట్ రూ .865, స్టాప్ లాస్ రూ .770.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


