ఈ రోజు స్టాక్​ మార్కెట్​కి లాభాలు! ఈ స్టాక్స్​లో ట్రేడ్​తో ప్రాఫిట్స్​కి ఛాన్స్​..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 26, 2025 7:28 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 314 పాయింట్లు పడి 84,587 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 75 పాయింట్లు కోల్పోయి 25,884 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 15 పాయింట్లు పడి 58,820 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 917.60 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,423.27 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50లో షార్ట్​ కవరింగ్​ జరిగి, పాజిటివ్​ ర్యాలీ మొదలవ్వాలంటే సూచీ 26,000 ఎగువకు వెళ్లాలి. 25,850 వద్ద 21 డీఎంఏ ఉంది. దాని చుట్టూనే సూచీ కదలాడుతోంది. అది బ్రేక్​ అయితే 25700 వద్ద సపోర్ట్​ ఉంది,” అని సెంట్రమ్​ బ్రోకింగ్​కి చెందిన టెక్నికల్​ అండ్​ డెరివేటివ్స్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ హెడ్​ నీలేశ్​ జైన్​ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.43 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.91శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.67 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

జుబీలియంట్​ ఇంగ్రీవియా- బై రూ. 725, స్టాప్​ లాస్​ రూ. 700, టార్గెట్​ రూ. 775

ఆదిత్య బిర్లా క్యాపిటల్​- బై రూ. 345, స్టాప్​ లాస్​ రూ. 333, టార్గెట్​ రూ. 370

దాల్మియా భారత్​- బై రూ. 2010, స్టాప్​ లాస్​ రూ. 1970, టార్గెట్​ రూ. 2060

కేఫిన్​ టెక్నాలజీస్​- బై రూ. 1050, స్టాప్​ లాస్​ రూ. 1035, టార్గెట్​ రూ. 1115

పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 273, స్టాప్​ లాస్​ రూ. 260, టార్గెట్​ రూ. 288

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ముత్తూట్ మైక్రోఫిన్: రూ.192 వద్ద కొనండి, టార్గెట్ రూ.206, స్టాప్ లాస్ రూ.186;

వండర్ ఎలక్ట్రికల్స్: రూ.178 వద్ద కొనండి, టార్గెట్ రూ.191, స్టాప్ లాస్ రూ.172;

కరారో ఇండియా: రూ .544 వద్ద కొనండి, టార్గెట్ రూ .585, స్టాప్ లాస్ రూ .525;

సంసేరా ఇంజినీరింగ్: రూ .1660 వద్ద కొనండి, లక్ష్యం రూ .1780, స్టాప్ లాస్ రూ .1600;

స్టైలం ఇండస్ట్రీస్: రూ .2178 వద్ద కొనండి, రూ .2340 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .2100.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

News/News/ఈ రోజు స్టాక్​ మార్కెట్​కి లాభాలు! ఈ స్టాక్స్​లో ట్రేడ్​తో ప్రాఫిట్స్​కి ఛాన్స్​..
News/News/ఈ రోజు స్టాక్​ మార్కెట్​కి లాభాలు! ఈ స్టాక్స్​లో ట్రేడ్​తో ప్రాఫిట్స్​కి ఛాన్స్​..