ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 141 బ్రేకౌట్ స్టాక్‌తో భారీ లాభాలకు ఛాన్స్!
అక్టోబర్ 29, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు పడి 84,628 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 30 పాయింట్లు కోల్పోయి 25,936 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 100 పాయింట్లు పెరిగి 58,214 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 636.30 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,060.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“26,000 దాటితే నిఫ్టీ50లో మంచి ర్యాలీ కనిపిస్తుంది. 26,300 వద్ద రెసిస్టెన్స్ ఉంది. 25,850 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.34 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.23శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.8 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఇండియన్ బ్యాంక్- బై రూ. 853, స్టాప్ లాస్ రూ. 823, టార్గెట్ రూ. 913
జేెఎస్డబ్ల్యూ స్టీల్- బై రూ. 258, స్టాప్ లాస్ రూ. 252, టార్గెట్ రూ. 268
ఫోర్టిస్ హెల్త్‌కేర్- బై రూ. 1060, స్టాప్ లాస్ రూ. 1040, టార్గెట్ రూ. 1100
మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 1518, స్టాప్ లాస్ రూ. 1480, టార్గెట్ రూ. 1570
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
రెమ్సన్స్ ఇండస్ట్రీస్: రూ.141.5, టార్గెట్ రూ.152, స్టాప్ లాస్ రూ.136.5
ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్: రూ .521 వద్ద కొనండి, రూ .560 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .500;
సాయి లైఫ్ సైన్సెస్: రూ.898, టార్గెట్ రూ.965, స్టాప్ లాస్ రూ.865;
టిటికె ప్రెస్టీజ్: రూ .716 వద్ద కొనండి, టార్గెట్ రూ .777, స్టాప్ లాస్ రూ .690;
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్: రూ .1005 వద్ద కొనండి, లక్ష్యం రూ .1085, స్టాప్ లాస్ రూ .970.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


