మ్యూచువల్​ ఫండ్​ సిప్​.. ఏ సందర్భాల్లో ఆపేయడం ఉత్తమం?

మీ మ్యూచువల్ ఫండ్ సిప్​ ఆపేయాలనుకుంటున్నారా? ఆపడం సరైన నిర్ణయమేనా? ఎలా తెలుసుకోవాలి? ఏ సందర్భాల్లో సిప్​ చేయడాన్ని ఆపేయొచ్చు? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Nov 09, 2025 4:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
మ్యూచువల్​ ఫండ్​ సిప్​ ఎప్పుడు ఆపేయాలి?
మ్యూచువల్​ ఫండ్​ సిప్​ ఎప్పుడు ఆపేయాలి?

మ్యూచువల్​ ఫండ్స్​లో సిప్​ (సిస్టెమ్యాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​) చేయండి, సిప్​ చేయండి అని అందరు చెబుతూనే ఉంటున్నారు! అంతా బాగానే ఉంది కానీ.. మరి మ్యూచువల్​ ఫండ్​లో సిప్​ చేయడం ఎప్పుడు ఆపేయాలి? సిప్​ని డిస్కంటిన్యూ చేయడం అనేది ఎలాంటి సందర్భాల్లో ఉత్తతమమైన నిర్ణయం అవుతుంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

మ్యూచువల్​ ఫండ్​ సిప్​..

సాధారణంగా, ఆర్థిక సలహాదారులు.. వీలైనంత వరకు సిప్​లను నిలిపివేయవద్దని ఇన్వెస్టర్లకు సలహా ఇస్తుంటారు. మార్కెట్లు పడిపోతున్నప్పుడు కూడా, "రూపీ కాస్ట్ యావరేజింగ్" కారణంగా, తక్కువ ధరకు ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి అదే సరైన సమయం అని చెబుతుంటారు.

కొన్నిసార్లు, వ్యాపారంలో నష్టాలు వచ్చినా సరే, ఈ కష్ట సమయాల్లో సిప్​ ఆపవద్దని సలహా ఇస్తారు. మరో కారణం ఏమిటంటే, కాంపౌండింగ్ ప్రయోజనం పూర్తి స్థాయిలో లభించాలంటే, దీర్ఘకాలం పెట్టుబడిలో కొనసాగడం చాలా కీలకం అని చెబుతుంటారు.

అయితే.. ప్రతి నియమానికి కొన్ని మినహాయింపులు ఉన్నట్లే, ఈ నియమాలకు కూడా ఉన్నాయి! మీ పరిస్థితులు మారితే లేదా సిప్​ కాలపరిమితి పూర్తయితే మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్​మెంట్​ని ఆపడంలో తప్పేమీ లేదు! ఇంకా చెప్పాలంటే.. ఈ విషయంలో మీరు ఒంటరివారు కారు!

మ్యూచువల్​ ఫండ్​ సిప్​ చేయడం ఆపేస్తున్నారు!

తాజా గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 2025లో నిలిపివేసిన మొత్తం సిప్​ల సంఖ్య 44.03 లక్షలుగా ఉంది. ఇది ఆగస్టులో నమోదైన 41.03 లక్షల కంటే 7% ఎక్కువ! ఈ గణాంకాల్లో కాలపరిమితి పూర్తయిన సిప్​లు కూడా కలిసి ఉన్నాయి.

గత సంవత్సరం 2024 సెప్టెంబర్ నెలలో 40.31 లక్షలు, ఆగస్టు నెలలో 36.54 లక్షల సిప్​లను నిలిపివేశారు. ఈ పెరుగుతున్న సంఖ్యను బట్టి, కొన్ని సందర్భాల్లో సిప్​ ఆపడం తప్పు కాదని స్పష్టమవుతోంది.

మీ మ్యూచువల్ ఫండ్ సిప్​ ఆపడానికి సరైన కారణాలు

I. ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడం

సిప్​ ఆపడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాన్ని సాధించడం. ఉదాహరణకు, మీరు కోరుకున్నంత డబ్బు పోగు చేసుకోగలిగితే, ప్రస్తుతానికి మీ సిప్​ని ఆపివేసి ఆ మొత్తాన్ని వేరే విధంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకోవచ్చు.

II. పెట్టుబడిని విస్తరించాల్సిన అవసరం (డైవర్సిఫికేషన్)

మీ పెట్టుబడిని డైవర్సిఫై చేయడం మరొక ముఖ్యమైన కారణం కావచ్చు. అంటే, ఒకే స్కీమ్‌లో ఇరుక్కుపోకుండా, మీ నిధులను వేర్వేరు పథకాలలో పెట్టాలని మీరు భావిస్తే, అప్పుడు మీరు ఒక పెద్ద సిప్​ని ఆపివేసి, చిన్న చిన్న సిప్​లను కొత్తగా ప్రారంభించవచ్చు.

III. తప్పును సరిదిద్దుకోవడం

కొన్నిసార్లు.. మీరు తప్పు ఫండ్‌ను, తప్పు కేటగిరీని లేదా తప్పు ఫండ్ హౌస్‌ను ఎంచుకున్నారని ఆలస్యంగా గ్రహించవచ్చు. అలాంటి పొరపాటును సరిదిద్దుకోవడానికి, మీరు పాత సిప్​ని నిలిపివేసి, ఆ మొత్తాన్ని వేరే మంచి ఫండ్‌లో మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు. దీనికోసం సిస్టెమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్​టీపీ)ను ఉపయోగించవచ్చు.

IV. ఫండ్ నష్టాల్లో కూరుకుపోవడం

మీరు ఏదైనా సెక్టార్​ ఆధారిత ఫండ్‌లో పెట్టుబడి పెట్టి, అది ప్రస్తుతం బ్యాడ్​ ఫేజ్​ ఎదుర్కొంటున్నట్లయితే, చాలా కాలం ఓపిక పట్టే బదులు, ఆ ఫండ్ నుంచి బయటకు వచ్చి, ఆ మొత్తాన్ని ఇండెక్స్ ఫండ్స్ వంటి సురక్షితమైన వాటిలో మళ్లీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవచ్చు. దీనినే ‘టెయిల్‌స్పిన్’ అని అంటారు.

V. ఆర్థిక అత్యవసర పరిస్థితి

వ్యక్తిగత జీవితంలో ఊహించని సంఘటన కారణంగా అత్యవసర పరిస్థితి ఏర్పడి, మీకు తక్షణమే నిధులు అవసరమైతే, అది కూడా సిప్​ ఆపడానికి సరైన కారణమే. కొత్తగా మారిన పరిస్థితుల్లో సిప్​ ద్వారా పెట్టుబడిని కొనసాగించడం మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ విషయంలో సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More