Ind vs WI: వన్డే క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా, అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అదే సమయంలో ఇండియన్ టీమ్ వన్డే ఫార్మాట్ లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

వెస్టిండీస్ పై రెండో వన్డేలో 406 రన్స్ టార్గెట్ ను కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే చేజ్ చేయడం విశేషం. రోహిత్ శర్మ కూడా సెంచరీ చేయగా.. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు ఏకంగా 255 రన్స్ జోడించారు. గిల్ చివరికి 133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్స్ లతో 223 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 2006లో సౌతాఫ్రికా చేజ్ చేసిన 438 రన్స్ తర్వాత రెండో అత్యధిక చేజింగ్ కూడా ఇదే.
గిల్.. రికార్డుల మోత
వెస్టిండీస్ తో తొలి వన్డేలోనూ సెంచరీ చేసిన గిల్.. రెండో మ్యాచ్ లో మరింత చెలరేగిపోయాడు. ఈసారి వన్డే క్రికెట్ లో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో తొలి, రెండో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2023లో న్యూజిలాండ్ పై హైదరాబాద్ లో జరిగిన వన్డేలోనూ గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
అంతేకాదు కేవలం 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. అతని దూకుడుతో విండీస్ టీమ్ ఇండియా ముందు ఉంచిన 406 పరుగుల కొండంత లక్ష్యం కూడా చిన్నబోయింది.
రోహిత్ శర్మ సెంచరీ
మరో ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీ చేసి 40 ఏళ్ల వయసులోనూ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడు. తొలి వన్డేలో నిరాశ పరిచిన హిట్ మ్యాన్.. ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్ లతో 101 రన్స్ చేసి ఔటయ్యాడు.
{{/usCountry}}మరో ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీ చేసి 40 ఏళ్ల వయసులోనూ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడు. తొలి వన్డేలో నిరాశ పరిచిన హిట్ మ్యాన్.. ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్ లతో 101 రన్స్ చేసి ఔటయ్యాడు.
{{/usCountry}}గిల్ తో కలిసి తొలి వికెట్ కు 255 రన్స్ జోడించాడు. గతంలో సచిన్, గంగూలీ కలిసి తొలి వికెట్ కు జోడించిన 258 రన్స్ రికార్డు పార్ట్‌నర్‌షిప్ కు చేరువగా వచ్చారు. ఆ సమయంలో రోహిత్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఈ క్రమంలో వన్డేల్లో రోహిత్ 12 వేల పరుగుల మైలురాయిని కూడా దాటాడు.