...
...
Next Story

Summer Car care : సమ్మర్​లో కారు ప్రయాణాలా? ఏసీ ఫుల్​గా పనిచేయాలంటే ఈ టిప్స్​ ఫాలో అవ్వండి..

Car AC tips : వేసవిలో కారు ఏసీ కేవలం సౌకర్యం మాత్రమే కాదు, అది ఒక అవసరం. కానీ ఏసీని ఎలా పడితే అలా వాడటం వల్ల ఇంధనం ఎక్కువ ఖర్చవ్వడమే కాకుండా ఏసీ కంప్రెసర్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కింద ఇస్తున్న టిప్స్​ ఫాలో అయితే మీ కారును ఐస్ లా మార్చుకోవచ్చు. అవేంటంటే..

Published on: Apr 26, 2026 04:01 PM IST
Advertisement

Improve Car AC Efficiency : భారతదేశంలో వేసవి తాపం మొదలైందంటే చాలు.. కారు ప్రయాణం ఒక సవాలుగా మారుతుంది. బయట భానుడి భగభగలకు తోడు, కారు లోపల ఉక్కపోత ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చాలామంది ఏసీ ఆన్ చేసినా కారు వెంటనే చల్లబడలేదని ఫిర్యాదు చేస్తుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో ఏసీ అసలు సరిగ్గా పనే చేయదు! అయితే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమ్మర్​లో కారు ఏసీ పనితీరును మెరుగుపరచుకోవడమే కాకుండా, ఇంజిన్‌పై భారాన్ని కూడా తగ్గించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..

1. ఏసీ ఆన్ చేసే ముందు గాలిని బయటకు పంపండి..

సమ్మర్​ కార్​ కేర్​ టిప్స్ మీకోసం.. (AI Generated Image)
సమ్మర్​ కార్​ కేర్​ టిప్స్ మీకోసం.. (AI Generated Image)

ఎండలో పార్క్ చేసిన కారు లోపల వేడి గాలి పేరుకుపోయి ఉంటుంది. కారు ఎక్కగానే ఏసీ ఆన్ చేసేయడం పెద్ద తప్పు.

చిట్కా: కారు స్టార్ట్ చేసే ముందు అన్ని డోర్లు లేదా కిటికీలను ఒక నిమిషం పాటు తెరిచి ఉంచండి. దీనివల్ల లోపల ఉన్న వేడి గాలి బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏసీ ఆన్ చేస్తే క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది.

2. కారు కదిలిన తర్వాతే గరిష్ట కూలింగ్!

చాలామంది కారు స్టార్ట్ చేయగానే ఏసీని అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద పెడతారు. కానీ కారు నిలబడి ఉన్నప్పుడు కంటే, ప్రయాణంలో ఉన్నప్పుడే ఏసీ కంప్రెసర్ వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది.

చిట్కా: కారు కొంత దూరం ముందుకు వెళ్లాక క్రమంగా టెంపరేచర్ తగ్గించండి. దీనివల్ల ఏసీ సిస్టమ్‌పై అనవసరమైన లోడ్ పడదు.

3. రీసర్క్యులేషన్ మోడ్ వాడండి

బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ మోడ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది బయటి వేడి గాలిని లోపలికి రానివ్వకుండా, లోపల ఉన్న చల్లని గాలినే మళ్లీ మళ్లీ తిప్పుతుంది.

సమ్మర్​ కార్​ కేర్​ టిప్స్..

4. పార్కింగ్ విషయంలో జాగ్రత్త

మనం కారును ఎక్కడ పార్క్ చేస్తామనే దానిపై కూడా ఏసీ పనితీరు ఆధారపడి ఉంటుంది. ఎండలో నేరుగా పార్క్ చేస్తే కారు లోపల ఉష్ణోగ్రత 60 డిగ్రీల వరకు వెళ్లే ప్రమాదం ఉంది.

చిట్కా: వీలైనంత వరకు నీడ ఉన్న చోట పార్క్ చేయండి. ఒకవేళ ఎండలో పార్క్ చేయాల్సి వస్తే 'సన్ షేడ్స్' వాడండి. కారు లోపల వేడి తక్కువగా ఉంటే, ఏసీ తక్కువ ఇంధనంతోనే త్వరగా చల్లబరుస్తుంది.

5. రెగ్యులర్ సర్వీసింగ్ మర్చిపోవద్దు

కారు ఇంజిన్ లాగే ఏసీకి కూడా మెయింటెనెన్స్ అవసరం.

చిట్కా: కారులోని 'క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్'ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి లేదా మార్చండి. అలాగే ఏసీ గ్యాస్ లెవల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోండి. ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోతే గాలి సరిగ్గా రాదు, దీనివల్ల ఏసీని ఎక్కువ సేపు వాడాల్సి వస్తుంది.

ఈ చిన్న మార్పులు మీ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చడమే కాకుండా, మీ కారు ఏసీ లైఫ్ ను కూడా పెంచుతాయి.

మీకు మీ ఫ్యామిలీకి హ్యాపీ అండ్ కూల్ జర్నీ!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe