జేఈఈ మెయిన్ అభ్యర్థులకు గూగుల్ బంపర్ ఆఫర్: జెమినిలో ఉచిత మాక్ టెస్టులు

గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్ 'జెమిని' (Gemini) ద్వారా పూర్తి స్థాయి జేఈఈ మెయిన్ మాక్ టెస్టులను ఉచితంగా అందిస్తోంది. గత వారమే శాట్ (SAT) పరీక్షల ప్రాక్టీస్ టెస్టులను ప్రారంభించిన గూగుల్, ఇప్పుడు భారతీయ విద్యార్థుల కోసం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Published on: Jan 29, 2026, 15:12:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంజనీరింగ్ విద్యార్థుల కలల కల జేఈఈ (JEE Main). ఈ పరీక్షలో రాణించేందుకు విద్యార్థులు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే, అభ్యర్థుల ప్రిపరేషన్‌ను మరింత సులభతరం చేస్తూ గూగుల్ ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్ ‘జెమిని’ ద్వారా పూర్తి స్థాయి జేఈఈ మెయిన్ మాక్ టెస్టులను ఉచితంగా అందిస్తోంది.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (REUTERS)
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (REUTERS)

సుందర్ పిచాయ్ ఎమోషన్

ఈ అప్డేట్‌పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందిస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. "నేను గతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగితే ఎంత బాగుంటుందో.. పోయిన వారం శాట్, ఈ వారం జెమినిలో ఉచితంగా అందుబాటులోకి వచ్చిన జేఈఈ మెయిన్ టెస్టుల పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని రాసుకొచ్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి అయిన పిచాయ్, తను జేఈఈ రాసిన రోజులను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థుల రియాక్షన్: "ఇది గేమ్ ఛేంజర్"

గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లి మాక్ టెస్టులు రాయలేని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇది వరం లాంటిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

"ఖరీదైన కోచింగ్ తీసుకోలేని విద్యార్థులకు ఇది నిజమైన గేమ్ ఛేంజర్" అని ఒక నెటిజన్ పేర్కొన్నారు. "ఏఐని కేవలం ఉత్పాదకత కోసమే కాకుండా, విద్య కోసం ఇలా వాడటం అభినందనీయం" అని మరొకరు ప్రశంసించారు.

"మా ప్రిపరేషన్ సమయంలో ఇలాంటివి ఉంటే బాగుండేది" అంటూ పలువురు నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

గూగుల్ జెమినిలో పరీక్ష ఎలా రాయాలి?

గూగుల్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ జోష్ వుడ్‌వర్డ్ స్పందిస్తూ.. భారతీయ విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాల మేరకే ఈ ఫీచర్‌ను తెచ్చినట్లు వెల్లడించారు. జెమిని యాప్‌లోకి వెళ్లి నేరుగా ఈ పూర్తి స్థాయి మాక్ టెస్టులను అటెంప్ట్ చేయవచ్చు. ఒక డెమో వీడియో ద్వారా దీనిని ఎలా ఉపయోగించాలో గూగుల్ వివరించింది. భవిష్యత్తులో మరిన్ని ప్రపంచ స్థాయి పరీక్షలను కూడా ఇందులో చేర్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన హింట్ ఇచ్చారు.

పిచాయ్ ప్రస్థానం..

మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి పట్టా పొందిన సుందర్ పిచాయ్, 2004లో గూగుల్‌లో చేరారు. తన ప్రతిభతో ఎదిగి 2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. భారతీయ విద్యా వ్యవస్థ, విద్యార్థుల అవసరాల పట్ల ఆయనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధకు ఈ తాజా నిర్ణయం ఒక నిదర్శనం.

Social media reacts

Pichai’s comment quickly gained traction, garnering more than 123,000 views and sparking a wave of reactions.

One user commented, “This is a game changer for students who cannot afford expensive coaching.” Another wrote, “Free full length mocks inside Gemini sounds unreal. Technology is finally levelling the field.” A third user said, “As a JEE aspirant, this feels like a blessing.” Another reaction read, “AI is genuinely being used for education now, not just productivity.” One user added, “Wish something like this existed when we were preparing for exams.” Yet another wrote, “Great initiative by Google for Indian students.”

Google leadership highlights India focus

Google Vice President for Google Labs, Gemini and AI Studio Josh Woodward also responded to the announcement, underlining the company’s focus on student needs in India. He wrote, “Good morning India! A lot of you asked for full length mock JEE Main tests in @GeminiApp at no cost, done! Good luck on your prep! Last week, SAT. This week, JEE. What other global exams would be most helpful?”

Check out the post here:

Pichai’s academic journey

Sundar Pichai is an alumnus of the Indian Institute of Technology Kharagpur, where he studied Metallurgical Engineering. He joined Google in 2004 and rose through the ranks before being appointed CEO in 2015.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More