...
...
Next Story

Gavaskar Vaibhav: ఐర్లాండ్‌తో సిరీస్‌లో వైభ‌వ్‌ను ఎందుకు ఆడించ‌లేదు? సునీల్ గవాస్క‌ర్ ఫైర్‌-ఇంగ్లాండ్‌లో సరిచేసుకోవాలంటూ

Gavaskar Vaibhav: భారత క్రికెట్ సరికొత్త సంచలనం, 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ డెబ్యూ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ తో సిరీస్ లో అతణ్ని ఆడించకపోవడంపై సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ఇంగ్లాండ్ లో తప్పు సరిదిద్దుకోవాలంటూ సూచించాడు.

Published on: Jun 29, 2026, 09:52:03 IST
Advertisement

Gavaskar Vaibhav: టీమిండియాపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆటగాళ్లపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ అయిన ఇండియన్ టీమ్.. పసికూన ఐర్లాండ్ చేతిలో వరుసగా రెండు టీ20 మ్యాచ్ లు ఓడిపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదంటూ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు.

వైభవ్ సూర్యవంశీ డెబ్యూ

ఐర్లాండ్‌తో సిరీస్‌లో వైభ‌వ్‌ను ఎందుకు ఆడించ‌లేదు? సునీల్ గవాస్క‌ర్ ఫైర్‌
ఐర్లాండ్‌తో సిరీస్‌లో వైభ‌వ్‌ను ఎందుకు ఆడించ‌లేదు? సునీల్ గవాస్క‌ర్ ఫైర్‌

భారత దేశవాళీ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న బీహార్‌కు చెందిన 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ అరంగేట్రంపై ప్రపంచ క్రికెట్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనే అతను అరంగేట్రం చేసి, ల్యాండ్‌మార్క్ సాధిస్తాడని అంతా అనుకున్నారు.

సునీల్ గవాస్కర్ ఫైర్

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత మేనేజ్‌మెంట్ ప్రస్తుతానికి సీనియర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌ల వైపే మొగ్గు చూపింది. దీంతో ఐర్లాండ్ తో సిరీస్ లో వైభవ్ డెబ్యూ చేయలేదు. ఈ సిరీస్ ను ఇండియా కోల్పోయింది. దీంతో ఈ సిరీస్ లో వైభవ్ ను ఎందుకు ఆడించలేదని టీమ్ మేనేజ్ మెంట్ ను సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు.

ఐర్లాండ్ లో ఆడిస్తారనుకున్నా

‘ఇండియా టుడే’తో గవాస్కర్ మాట్లాడుతూ.. "ఐర్లాండ్‌ను పెద్ద ముప్పుగా భావించకుండా యువ ఆటగాడు సూర్యవంశీకి తొలి మ్యాచ్‌లోనే అవకాశం ఇస్తారని నేను నిజంగా అనుకున్నా. అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్‌లలో ఒకరికి రెస్ట్ ఇచ్చి, వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపాల్సింది.

ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ 700కు పైగా పరుగులు చేసి అద్భుత ఫామ్‌తో జాతీయ జట్టు పిలుపు అందుకున్నాడు. అంతేకాకుండా, శ్రీలంకతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్‌లో కేవలం 11 బంతుల్లోనే లిస్ట్-ఎ (List-A) క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

నమ్మశక్యం కాని విషయం

"లిస్ట్-ఎ క్రికెట్‌లో కేవలం 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కును అందుకోవడం అనేది నమ్మశక్యం కాని విషయం. ఇవి చాలా ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌లు. అందుకే అతని చుట్టూ ఇంత అంచనాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో సిరీస్‌లో వైభవ్ ఓపెనర్‌గా రావడం ఖాయం. అతని ఆడించి తప్పు సరిదిద్దుకోవాలి’’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

సచిన్ 37 ఏళ్ల రికార్డు బద్దలవుతుందా?

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో (16 ఏళ్ల 205 రోజులు) అంతర్జాతీయ క్రికెట్ (టెస్ట్) లో అరంగేట్రం చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసులోనే ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ సిరీస్‌లో బరిలోకి దిగితే, సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలవ్వడం ఖాయం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe