...
...
Next Story

Suzuki Burgman 150 : సుజుకీ బర్గ్‌మాన్ 150 లాంచ్.. యమహా ఏరాక్స్‌కి గట్టి పోటీ!

Best scooter in India : ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ సుజుకీ తమ పాపులర్ మ్యాక్సీ-స్కూటర్ సిరీస్‌లో సరికొత్త ‘సుజుకీ బర్గ్‌మాన్ 150’ని విడుదల చేసింది. భారతదేశంలో ప్రస్తుతం అమ్ముడవుతున్న బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 సీసీ మోడల్‌కు ఇది పెద్ద వెర్షన్. వివరాల్లోకి వెళితే..

Published on: May 19, 2026, 16:01:37 IST
Advertisement

ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, అధునాతన ఫీచర్లు ఉన్న ప్రీమియం స్కూటర్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సుజుకీ మోటార్‌సైకిల్ సంస్థ అంతర్జాతీయంగా తమ లైనప్‌ను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగానే, లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలో సరికొత్త ‘సుజుకీ బర్గ్‌మాన్ 150’ మ్యాక్సీ-స్కూటర్‌ను కంపెనీ గ్లోబల్‌గా డెబ్యూ చేసింది. గత నెలలోనే సుజుకీ ఇండియాలో న్యూ-జనరేషన్ బర్గ్‌మాన్ స్ట్రీట్​ని లాంచ్ చేసిన తరుణంలో, ఈ 150 సీసీ స్కూటర్ ఆవిష్కరణ భారతీయ ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

సుజుకీ బర్గ్‌మాన్ 150: లుక్, డిజైన్ ఎలా ఉంది?

The Suzuki Burgman 150 looks more premium than the Burgman Street that is sold in India.
The Suzuki Burgman 150 looks more premium than the Burgman Street that is sold in India.

ఇండియాలో లభించే 125 సీసీ సుజుకీ బర్గ్‌మాన్ స్ట్రీట్‌తో పోలిస్తే ఈ కొత్త బర్గ్‌మాన్ 150 చాలా భిన్నంగా, పెద్దదిగా కనిపిస్తుంది.

ఫ్రంట్ లుక్: దీని ముందు భాగంలో వెడల్పైన కౌల్, ప్రత్యేకమైన ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, సెంటర్ పొజిషన్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లను ఇచ్చారు.

రైడింగ్ కంఫర్ట్: స్కూటర్‌కు స్పోర్టీ లుక్ ఇచ్చేలా పెద్ద వైజర్, చంకీ ఎగ్జాస్ట్ (సైలెన్సర్) ఉన్నాయి. ప్రయాణంలో కంఫర్ట్ కోసం స్లోపింగ్, ఫ్లాట్ ఫుట్‌రెస్ట్‌లు ఉన్నాయి. కారులాగే దీని మధ్యలో ఒక సెంటర్ స్పైన్ డిజైన్ ఇవ్వడం విశేషం.

వీల్స్ అండ్ స్టోరేజ్: ఇది 14-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. సీటు ఎత్తు కేవలం 760 ఎంఎం మాత్రమే ఉండటం వల్ల రైడర్‌కు వాహనంపై మంచి కంట్రోల్ లభిస్తుంది. సీటు కింద ఏకంగా 25-లీటర్ల డీప్ అండర్‌సీట్ స్టోరేజ్ ఇచ్చారు. ఇందులో ఒక హెల్మెట్, చిన్న బ్యాగ్‌ను సులభంగా పెట్టేయొచ్చు.

సుజుకీ బర్గ్​మాన్- అధునాతన ఫీచర్ల పండగ..

ఈ మ్యాక్సీ స్కూటర్ అధునాతన టెక్నాలజీతో లోడ్ అయ్యింది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను సపోర్ట్ చేసే టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంది. వీటితో పాటు టైప్-సీ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, కీ‌లెస్ ఇగ్నిషన్, సురక్షితమైన బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, జారిపోకుండా ఉండేందుకు స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా అందించారు.

సుజుకీ బర్గ్​మాన్ 150- ఇంజిన్, పర్ఫార్మెన్స్..

ఈ స్కూటర్‌ను భారతదేశంలో లాంచ్ చేయడంపై సుజుకీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద టూ-వీలర్ మార్కెట్ అయిన భారత్‌లో 150సీసీ పైబడిన ప్రీమియం స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. అందుకే ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్‌తో వచ్చిన ఈ స్కూటర్ త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మార్కెట్​లో యమహా ఏరాక్స్ 155, హీరో జూమ్ 160, టీవీఎస్ ఎన్‌టార్క్ 150 వంటి మోడళ్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ సుజుకి గనుక ఈ బర్గ్‌మాన్ 150 ని దేశీయంగా లాంచ్ చేస్తే.. ఈ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe