బిర్యానీ రికార్డ్: స్విగ్గీలో 2025లో మోస్ట్ ఆర్డర్డ్ డిష్ ఇదే.. సెకండ్ ప్లేస్?

భారతీయుల బిర్యానీ ప్రేమాభిమానాలు మరోసారి రికార్డు సృష్టించాయి. 2025లో స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా బిర్యానీ వరుసగా పదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏకంగా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి.

Published on: Dec 23, 2025, 15:49:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ట్రెండ్స్ వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ బిర్యానీ క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఈ విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ 'స్విగ్గీ' (Swiggy) విడుదల చేసిన 2025 వార్షిక నివేదిక మరోసారి స్పష్టం చేసింది. భారతీయుల పాలిట బిర్యానీ కేవలం ఒక వంటకం కాదు, అదొక ఎమోషన్ అని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

బిర్యానీ రికార్డ్: స్విగ్గీలో 2025లో మోస్ట్ ఆర్డర్డ్ డిష్ ఇదే
బిర్యానీ రికార్డ్: స్విగ్గీలో 2025లో మోస్ట్ ఆర్డర్డ్ డిష్ ఇదే

ప్రతి సెకనుకూ బిర్యానీ సందడి

స్విగ్గీ నివేదిక ప్రకారం, 2025లో దేశవ్యాప్తంగా నిమిషానికి సగటున 194 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అంటే ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ అమ్ముడైందన్నమాట. ఈ ఏడాది మొత్తం మీద స్విగ్గీ ద్వారా 9.3 కోట్ల బిర్యానీలను భారతీయులు ఆరగించారు. ఇందులో 'చికెన్ బిర్యానీ' 5.77 కోట్ల ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలిచి తన సత్తా చాటుకుంది.

రెండో స్థానంలో ఎవరు?

బిర్యానీ తర్వాతి స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ ఏడాది మోస్ట్ ఆర్డర్డ్ లిస్ట్‌లో టాప్ 4 డిషెష్ ఇవే:

  1. బిర్యానీ: 9.3 కోట్ల ఆర్డర్లు
  2. బర్గర్: 4.42 కోట్ల ఆర్డర్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
  3. పిజ్జా: 4.01 కోట్ల ఆర్డర్లతో మూడో స్థానంలో నిలిచింది.
  4. వెజ్ దోశ: 2.62 కోట్ల ఆర్డర్లతో నాలుగో స్థానంలో ఉంది.

ఒక దశాబ్దపు ఆధిపత్యం

వరుసగా పదేళ్ల పాటు స్విగ్గీలో నంబర్ 1 డిష్‌గా బిర్యానీ నిలవడం ఒక అరుదైన రికార్డు. "బిర్యానీ తిరుగులేని రారాజు. సుగంధ ద్రవ్యాల మేళవింపుతో తయారయ్యే ఈ అద్భుతమైన వంటకం పట్ల భారతీయులకు ఉన్న ఇష్టం ఎప్పటికీ చెక్కుచెదరదు" అని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది.

ఈ సందర్భంగా స్విగ్గీ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ మాట్లాడుతూ.. "భారతదేశంలో ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడమే కాదు, అది జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది. అర్థరాత్రి ఆకలి వేసినా, ఏదైనా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా భారతీయులు ఫుడ్‌కే ప్రాధాన్యత ఇస్తారు. ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగమైనందుకు మాకు సంతోషంగా ఉంది" అని తెలిపారు.

కేవలం స్విగ్గీలోనే ఈ స్థాయి ఆర్డర్లు ఉంటే, ఇక జొమాటో లేదా నేరుగా రెస్టారెంట్లకు వెళ్లి తినే వారి సంఖ్యను కూడా కలిపితే బిర్యానీ విక్రయాలు ఊహకందని స్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More