తమిళనాడు పెట్టుబడుల సీక్రెట్స్ ఏపీకి లీక్.. సీఎం విజయ్ సీరియస్.. 15 మంది ఉద్యోగులపై వేటు!
ఇటీవల విశాఖపట్నం వేదికగా సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఏకంగా 15 మంది ఉద్యోగులపై వేటు పడింది.
విశాఖ సీఐఐ సమ్మిట్ మీద తమిళనాడులో పొలిటికల్ వార్ నడుస్తోంది. తమిళనాడుకు రావాల్సిన భారీ పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లీక్ చేశారనే ఆరోపణలతో 15 మంది ఉద్యోగులను విధుల నుండి తొలగించారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడుల ఆకర్షణపై సలహాలు ఇచ్చే ప్రధాన సంస్థ గైడెన్స్ తమిళనాడులో పనిచేస్తున్న 15 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై ఈ మేరకు వేటు పడింది.

రాజకీయ దుమారం మధ్యే కీలక చర్య
ఇటీవలి కాలంలో తమిళనాడుకు రావాల్సిన అనేక ప్రతిష్టాత్మక పరిశ్రమలు, పెట్టుబడులు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను అధికార టీవీకే ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర పెట్టుబడుల రహస్యాలను ఏపీకి చేరవేస్తున్నారనే కారణంతో 15 మంది సిబ్బందిని తొలగించడం తమిళనాడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపుతోంది.
అసలు లోపం ఎక్కడ?
తొలగించిన 15 మంది సిబ్బంది కూడా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారేనని తెలిసింది. గతంలో వీరిని విధుల్లోకి తీసుకునే సమయంలో, ప్రభుత్వ వ్యాపార లేదా పెట్టుబడుల రహస్యాలను బయటకు చెప్పకూడదనే నిబంధన (Non-Disclosure Agreement - NDA) లేదా కాపీరైట్ ఒప్పందాలను సరిగ్గా కుదుర్చుకోలేదని సమాచారం. ఎలాంటి కఠినమైన రహస్య ఒప్పందాలు లేకుండానే పలువురిని కీలక బాధ్యతల్లో నియమించడమే ఈ సమాచార లీక్‌కు కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగం పోయిన వెంటనే ఏపీ ప్రభుత్వంలో చేరిక!
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో ఉద్యోగాల నుండి తొలగించిన 15 మందిలో క్రిస్టో లారెల్, ప్రభాకరన్ అండి, ప్రీజా ప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులు, ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలిలో చేరారని తమిళనాడు మీడియా పేర్కొంటోంది. ఏపీ ప్రభుత్వ విభాగంలో విధుల్లో చేరిన విషయాన్ని వారే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారని తెలిపింది.
కీలక పరిణామాలు
తమిళనాడు పెట్టుబడుల విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తులు, ఉద్యోగం నుండి తొలగించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగంలో ఎలా చేరారనే దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడే వీరు ఏపీ ప్రభుత్వ అధికారులతో రహస్యంగా సంప్రదింపులు జరిపారా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
తమిళనాడుకు రాబోయే పెట్టుబడిదారుల వివరాలు, రహస్య సమాచారం వీరి వద్ద ఉండటం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకుందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి రెండు పొరుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీ తీవ్రంగా ఉన్న వేళ, ఈ సమాచార లీకేజీ వ్యవహారం పెను దుమారానికి దారితీస్తోంది.
తమిళనాడులో ఏర్పాటు అవుతాయనుకున్న దక్షిణ కొరియాకు చెందిన 2 పరిశ్రమలు.. 1400 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనంతపురంలో ఏర్పాటుకు ఏపీలో ఒప్పందం కుదరడం కూడా చర్చనీయాంశమైంది. సీఎం విజయ్, డీఎంకే అధినేత స్టాలిన్ మధ్య దీనిపై పొలిటికల్ వార్ నడుస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


