Tata Curvv X : టాటా కర్వ్ సిరీస్ X వచ్చేసింది- రూ. 9.99 లక్షలకే సూపర్‌ ఫీచర్లు! పూర్తి వివరాలు ఇవే..

భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్.. సరికొత్త "కర్వ్ సిరీస్ X" ఎస్‌యూవీని లాంచ్ చేసింది. రూ. 9.99 లక్షల ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో వచ్చిన ఈ కార్లో సరికొత్త 'ఆర్-కంఫర్ట్' సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 అడాస్ వంటి భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Published on: Sep 4, 2026, 05:58:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతదేశంలో కాంపాక్ట్, కూపే ఎస్‌యూవీ మార్కెట్‌ను ఏలుతున్న టాటా మోటార్స్ మరో కీలక నిర్ణయంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఆటో ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త "కర్వ్ సిరీస్ ఎక్స్" మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ప్రారంభ ధరను రూ. 9.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

టాటా కర్వ్ సిరీస్ ఎక్స్..
టాటా కర్వ్ సిరీస్ ఎక్స్..

స్మార్ట్ X, ప్యూర్ X, ప్యూర్ X+, క్రియేటివ్ X+, ఆకంప్లిష్డ్ X, ఆకంప్లిష్డ్ X+ అనే ప్రధాన వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. అంతేకాకుండా, స్టైలిష్ లుక్ ఇష్టపడే వారి కోసం ఎంపిక చేసిన వేరియంట్లలో ప్రత్యేకంగా ‘డార్క్ ఎడిషన్’ కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త సిరీస్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది.

స్మార్ట్ X: బేస్ వేరియంట్‌లోనే ప్రీమియం సౌకర్యాలు..

ఈ మోడల్ శ్రేణిలో బేస్ వేరియంట్ అయిన 'స్మార్ట్ X' అనేక వినూత్న ఫీచర్లతో వచ్చింది. దేశంలోనే తొలిసారిగా 'ఆర్-కంఫర్ట్' ప్యాసివ్ వెంటిలేటెడ్ సీట్లను ఇందులో పరిచయం చేశారు. దీర్ఘకాల ప్రయాణాల్లో సైతం అలసట కలగకుండా ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

దీనితో పాటు ఆర్17 ఏరో స్టైల్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కప్‌ హోల్డర్లతో కూడిన రియర్ ఆర్మ్‌రెస్ట్, పలు రకాల డ్రైవింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. భద్రతకు సంబంధించి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్పీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వంటి ప్రమాణాలు ప్రామాణికంగా లభిస్తాయి.

ప్యూర్ X, ప్యూర్ X+: టెక్నాలజీ, కంఫర్ట్ కలబోత..

'ప్యూర్ X' వేరియంట్‌లోకి అడుగుపెడితే, 10.25-ఇంచ్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే సపోర్ట్ చేస్తుంది. 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్‌వీఎమ్‌లు, వెనుక ఏసీ వెంట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

ఇక 'ప్యూర్ X+' మోడల్‌లో ప్రీమియం బెనెకే-కాలికో ఆయిస్టర్ వైట్ లెదరెట్ సీట్లు, ఆర్17 డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. డార్క్ ఎడిషన్‌ను ఎంచుకుంటే ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ రెండూ బ్లాక్ థీమ్‌లో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

క్రియేటివ్ X+: పనోరమిక్ సన్‌రూఫ్‌తో గ్రాండ్ ఎంట్రీ..

రూ. 12.90 లక్షల ధరతో లభించే 'క్రియేటివ్ X+' వేరియంట్ ప్రధాన ఆకర్షణ వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్. కేవలం వాయిస్ కమాండ్‌తోనే సన్‌రూఫ్‌ను నియంత్రించవచ్చు. ఆర్18 డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, 360-డిగ్రీ 3డీ సరౌండ్-వ్యూ కెమెరా, బ్లైండ్-వ్యూ మానిటర్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. క్యాబిన్‌లో రెండు 10.25-ఇంచ్ స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ డిజిటల్ కాక్‌పిట్), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), ఆటోమేటిక్ వైపర్లు, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి అనుకూలతలు ఉన్నాయి.

ఆకంప్లిష్డ్ వేరియంట్లు: అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ..

కర్వ్ సిరీస్ Xలో టాప్ వేరియంట్లయిన 'ఆకంప్లిష్డ్ X', 'ఆకంప్లిష్డ్ X+' మోడళ్లలో అత్యంత సురక్షితమైన ‘లెవెల్-2 అడాస్’ టెక్నాలజీని అందించారు. రోడ్డుపై ప్రమాదాలను ముందుగానే ఊహించి హెచ్చరించే ఈ సాంకేతికత డ్రైవర్‌కు ఎంతో సహాయపడుతుంది.

సీక్వెన్షియల్ ఎల్‌ఈడీ డీఆర్​ఎల్స్, వెల్‌కమ్ అండ్ గుడ్‌బై యానిమేషన్స్, అంబియంట్ మూడ్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టాప్-ఎండ్ 'ఆకంప్లిష్డ్ X+'లో జెస్టర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్ ఆప్షన్ ఉంది. 12.3-ఇంచ్ హార్మన్ డిస్‌ప్లే, 9-స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, అలెక్సా ఇంటెగ్రేషన్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి.

మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు టాటా కర్వ్ సిరీస్ X గట్టి పోటీ ఇవ్వనుంది. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ఇప్పటికే 56 శాతం వృద్ధిని నమోదు చేసిన టాటా సంస్థకు ఈ కొత్త మోడల్ మరింత బలాన్నిస్తుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

టాటా కర్వ్ సిరీస్ ఎక్స్​ వేరియంట్లు, వాటి ధరలు..

టాటా కర్వ్ ఎక్స్ వేరియంట్లుఎక్స్​షోరూం ధర
Smart X—
Pure X MT ₹9.99 lakh
Pure X DCT ₹10.99 lakh
Pure X+ MT ₹11.79 lakh
Pure X+ DCT ₹12.29 lakh
Pure X+ #DARK MT ₹11.99 lakh
Pure X+ #DARK DCT ₹13.09 lakh
Creative X+ MT ₹12.90 lakh
Creative X+ DCT ₹13.29 lakh
Creative X+ #DARK MT ₹13.15 lakh
Creative X+ #DARK DCT ₹14.20 lakh
Accomplished X MT ₹13.99 lakh
Accomplished X DCT ₹14.45 lakh
Accomplished X #DARK MT ₹14.24 lakh
Accomplished X #DARK DCT ₹15.54 lakh
Accomplished X+ ₹18.49 lakh
Accomplished X+ #DARK ₹18.74 lakh– ₹18.99 lakh
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More