...
...
Next Story

భారత్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌కు 5-స్టార్ రేటింగ్

టాటా మోటార్స్‌కు చెందిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'టాటా పంచ్ ఈవీ' (Tata Punch.ev) భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. తన విభాగంలో అత్యంత సురక్షితమైన వాహనాల్లో ఒకటిగా నిలిచింది.

Published on: Jul 29, 2026, 14:27:16 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి భద్రతా ప్రమాణాలలో టాటా మోటార్స్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారత్ ఎన్‍సిఎపి (Bharat NCAP) నిర్వహించిన భద్రతా పరీక్షల్లో టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అత్యుత్తమ ఫలితాలను సాధించి, ఐదు నక్షత్రాల (5-Star Rating) భద్రతా రేటింగ్‌ను దక్కించుకుంది.

భారత్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌కు 5-స్టార్ రేటింగ్
భారత్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌కు 5-స్టార్ రేటింగ్

టెస్టింగ్ కోసం ఉపయోగించిన టాటా పంచ్ ఈవీ 'అడ్వెంచర్ 40' (Adventure 40), 'ఎంపవర్డ్+ ఎస్ 40' (Empowered+ S 40) వేరియంట్‌లు డ్రైవర్, ప్రయాణికుల భద్రతలో విశేషమైన పనితీరును కనబరిచాయి.

పెద్దల భద్రత

పెద్దల రక్షణ విభాగంలో పంచ్ ఈవీ 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించింది.

  • ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్: 16 పాయింట్లకు గాను 15.28 పాయింట్లు లభించాయి.
  • సైడ్ మూవబుల్ క్రాష్ టెస్ట్: 16 పాయింట్లకు గాను 15.80 పాయింట్లు వచ్చాయి.
  • సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్: ఈ విభాగంలో వాహనం 'OK' రేటింగ్‌ సాధించింది.

క్రాష్ అసెస్‌మెంట్ నివేదికల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికుల శరీర భాగాలకు 'గుడ్' (అత్యుత్తమ), 'అడిక్వేట్' (తగినంత) రక్షణ లభిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు.

పిల్లల భద్రత

చిన్నారుల రక్షణ విభాగంలో పంచ్ ఈవీ 49 పాయింట్లకు గాను 45.00 పాయింట్లు సాధించి అదరగొట్టింది.

  • డైనమిక్ స్కోర్: 24 కి 24 పాయింట్లు.
  • సిఆర్‌ఎస్ (CRS) ఇన్‌స్టాలేషన్: 12 కి 12 పూర్తి పాయింట్లు.

18 నెలల చిన్నారి, 3 సంవత్సరాల చిన్నారి బొమ్మలపై (Child Dummies) చేసిన పరీక్షల్లో ఫ్రంటల్ క్రాష్‌లో 8/8 పాయింట్లు, సైడ్ ఇంపాక్ట్‌లో 4/4 పాయింట్లు సాధించాయి. వెనుక సీట్లలో ప్రయాణించే చిన్నారులకు ఇది గరిష్ఠ రక్షణను ఇస్తుంది.

లభించే భద్రతా ఫీచర్లు

మే 2026లో జరిపిన పరీక్షల ప్రకారం.. స్మార్ట్+ 40, అడ్వెంచర్ 40, ఎంపవర్డ్ 40, ఎంపవర్డ్+ ఎస్ 40, స్మార్ట్ 30, స్మార్ట్+ 30 వేరియంట్లన్నింటికీ ఈ 5-స్టార్ రేటింగ్ వర్తిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe