దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక (Q3) ఫలితాలను సోమవారం విడుదల చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ నికర లాభం సుమారు 14 శాతం మేర తగ్గి రూ.10,657 కోట్లుగా నమోదైంది. అయితే, కంపెనీ రెవెన్యూ మాత్రం దాదాపు 5 శాతం పెరిగి రూ.67,087 కోట్లకు చేరింది.
ప్రధానంగా కొత్త కార్మిక చట్టాల అమలు కారణంగా రూ.2,128 కోట్ల వన్-టైమ్ ఛార్జీలు, అలాగే న్యాయపరమైన వివాదాల కోసం రూ.1,010 కోట్లు వెచ్చించాల్సి రావడంతో లాభదాయకతపై ఆ ప్రభావం పడింది.
టీసీఎస్ ఫలితాల్లోని 5 ముఖ్యమైన ముఖ్యాంశాలు:
1. ఇన్వెస్టర్లపై డివిడెండ్ల వర్షం
లాభం తగ్గినా, టీసీఎస్ తన వాటాదారులను ఆనందపరిచే నిర్ణయం తీసుకుంది. ఒక్కో షేరుపై రూ.11 మూడో మధ్యంతర డివిడెండ్‌తో పాటు రూ.46 స్పెషల్ డివిడెండ్‌ను ప్రకటించింది. అంటే మొత్తంగా ఒక షేరుపై రూ.57 డివిడెండ్ లభించనుంది. దీనికి అర్హులైన వారిని తేల్చేందుకు జనవరి 17ను రికార్డు తేదీగా నిర్ణయించగా, ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లింపులు జరగనున్నాయి.
2. దూసుకుపోతున్న ఏఐ (AI) సేవలు
"ప్రస్తుతం మా ఏఐ సేవలు ఏడాదికి 1.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా ఎదగడమే మా లక్ష్యం," అని టీసీఎస్ సీఈఓ, ఎండీ కె. కృతివాసన్ తెలిపారు. క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో క్లయింట్లు పెట్టుబడులు పెట్టడం కంపెనీకి కలిసొచ్చిందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్తి సుబ్రమణ్యం పేర్కొన్నారు.
3. ఏయే మార్కెట్లలో ఎలా ఉంది?
వ్యాపార పరంగా చూస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) రంగం 1.6% వృద్ధిని నమోదు చేసింది. హెల్త్‌కేర్, ఎనర్జీ రంగాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే, భారతీయ మార్కెట్లో మాత్రం 34.3% మేర వ్యాపారం తగ్గడం గమనార్హం. యూకేలో 3.2% తగ్గుదల కనిపించగా, ఉత్తర అమెరికా (1.3%), ఆసియా పసిఫిక్ (3.5%), మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా (8.3%) మార్కెట్లు లాభాలను అందించాయి.
4. డీల్స్, భాగస్వామ్యాలు
{{/usCountry}}వ్యాపార పరంగా చూస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) రంగం 1.6% వృద్ధిని నమోదు చేసింది. హెల్త్‌కేర్, ఎనర్జీ రంగాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే, భారతీయ మార్కెట్లో మాత్రం 34.3% మేర వ్యాపారం తగ్గడం గమనార్హం. యూకేలో 3.2% తగ్గుదల కనిపించగా, ఉత్తర అమెరికా (1.3%), ఆసియా పసిఫిక్ (3.5%), మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా (8.3%) మార్కెట్లు లాభాలను అందించాయి.
4. డీల్స్, భాగస్వామ్యాలు
{{/usCountry}}ఈ త్రైమాసికంలో టీసీఎస్ మొత్తం 9.3 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను (TCV) కుదుర్చుకుంది. గూగుల్ క్లౌడ్‌తో భాగస్వామ్యం విస్తరణ, ఏబీబీ (ABB), అవివా (Aviva) వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు ఇందులో ముఖ్యమైనవి. కోస్టల్ క్లౌడ్ అనే సంస్థను 100% కొనుగోలు చేసే ప్రక్రియను కూడా టీసీఎస్ చేపట్టింది.
5. తగ్గిన ఉద్యోగుల సంఖ్య.. పెరిగిన నైపుణ్యం
ఉద్యోగుల వలసల రేటు (Attrition) 13.5 శాతంగా ఉంది. రెండో త్రైమాసికం చివరలో 5,93,314 మంది ఉద్యోగులు ఉండగా, మూడో త్రైమాసికానికి ఆ సంఖ్య 5,82,163 కు తగ్గింది. అయితే, కంపెనీలో ఏకంగా 2,17,000 మందికి పైగా ఉద్యోగులు అధునాతన ఏఐ నైపుణ్యాలను కలిగి ఉన్నారని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ వెల్లడించారు.
మొత్తంగా చూస్తే, టీసీఎస్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ.. భారీ డివిడెండ్ల ప్రకటన ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపుతోంది.