...
...
Next Story

వేలు చూపించిన గంభీర్.. మాటలు ఆపి ఇక పని చూడమన్న కుంబ్లే.. టీమిండియా హెడ్ కోచ్‌పై తీవ్ర విమర్శలు

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు మాజీ ప్లేయర్, కోచ్ అయిన అనిల్ కుంబ్లే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సౌతాఫ్రికాతో రెండో టెస్టులోనూ ఓటమి ముంగిట ఉండటంతో అభిమానులు కూడా మండిపడుతున్నారు.

Published on: Nov 25, 2025, 19:04:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. దీంతో స్వదేశంలో దారుణమైన వైట్ వాష్ తప్పేలా లేదు. ఇండియన్ టీమ్ దారుణమైన ప్రదర్శనతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ప్లేయర్స్ ను ఉద్దేశించి గంభీర్ వేలు చూపిస్తూ మాట్లాడటం.. దానికి మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

గంభీర్ మాటలు.. చేతలు కావాలన్న కుంబ్లే

వేలు చూపించిన గంభీర్.. మాటలు ఆపి ఇక పని చూడమన్న కుంబ్లే.. టీమిండియా హెడ్ కోచ్‌పై తీవ్ర విమర్శలు (PTI)
వేలు చూపించిన గంభీర్.. మాటలు ఆపి ఇక పని చూడమన్న కుంబ్లే.. టీమిండియా హెడ్ కోచ్‌పై తీవ్ర విమర్శలు (PTI)

సౌతాఫ్రికాతో టీమిండియా రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలుసు కదా. మంగళవారం (నవంబర్ 25) నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు గంభీర్ ప్లేయర్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ సమయంలో గతేడాది గంభీర్ ఇచ్చిన ఒక పాత ప్రెస్ కాన్ఫరెన్స్ క్లిప్‌ను బ్రాడ్‌కాస్టర్‌లు ప్లే చేశారు. ఆ క్లిప్‌లో గంభీర్ మాట్లాడుతూ.. "భారత జట్టు ఒక రోజులో 400 పరుగులు చేయడానికి సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అవసరమైతే, టెస్ట్ మ్యాచ్‌ను కాపాడుకోవడానికి రెండు రోజులు కూడా బ్యాటింగ్ చేయాలి" అని అందులో అన్నాడు.

దీనిపై బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో ఉన్న భారత మాజీ దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే స్పందించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన అత్యుత్తమ జట్టుపై తమ శక్తిని చూపించడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని, మాటలు కాదు.. ఇక చేతలతో అది చూపించాల్సిన సమయం ఇదేనని కుంబ్లే అనడం విశేషం.

కుంబ్లే ఏమన్నాడంటే?

"మీరు ఆ మాటలకు తప్పకుండా కట్టుబడి ఉండాలి. మీరు ఈ రోజు ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ జట్టుతో ఆడుతున్నారు. అది డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలిచిన టీమ్. మీ క్యారెక్టర్, పోరాట పటిమను చూపించడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి లేదు. మనం గెలవకపోయినా, కనీసం పోరాడాలి.. ఓడిపోకుండా చూసుకోవాలి. అవును ఆ మాటలు బాగుంటాయి.. కానీ మీరు దానిని ప్రదర్శనతో కూడా నిరూపించాలి" అని కుంబ్లే అన్నాడు.

గంభీర్ తీరుపై చర్చ

సౌతాఫ్రికా దాదాపు రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన పిచ్‌పై భారత్ కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో గంభీర్ బ్యాటర్లకు క్లాస్ పీకినట్లుగా కనిపించాడు. అయినా టీమ్ ఆటతీరులో ఎలాంటి మార్పులేదు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా అప్పుడే రెండు వికెట్లు కోల్పోయింది. చివరి రోజు మొత్తం పోరాడితే తప్ప కనీసం డ్రా చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఓటమి ఖాయంగానే కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe