టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ : ఇంజినీరింగ్ అభ్యర్థులకు అలర్ట్ - వెబ్ ఆప్షన్లకు కొన్ని గంటలే గడువు..!
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా వెబ్ ఆప్షన్ల గడువు ఇవాళ్టితో(జూలై 10) పూర్తి కానుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. జూలై 18న తొలి విడత సీట్లను కేటాయిస్తారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా… రిజిస్ట్రేషన్లతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. ప్రస్తుతం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు ఇవాళ్టితో(జూలై 10) పూర్తి కానుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు… వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణ ఈఏపీసెట్- 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా రిజిస్రేషన్ చేసుకున్న అభ్యర్థులు తప్పకుండా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే అభ్యర్థి సాధించే ర్యాంక్ ఎంతో కీలకం. అంతేకాకుండా రిజర్వేషన్ ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు. రెండింటి ఆధారంగా…. సీటును కేటాయిస్తారు.
వెబ్ ఆప్షన్ల ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీలోని ప్రమాణాలు, ప్లేస్ మెంట్ తో పాటు ఇతర అంశాలను బేరీజీ వేసుకొని కాలేజీలను ఎంచుకోవటం మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. https://tgeapcet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈఏపీసెట్రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
బుధవారం వరకు 74 వేలకుపైగా అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు ఎంచుకున్నారు. ఇవాళ కూడా సమయం ఉండటంతో… మరికొంత అభ్యర్థులు కాలేజీలను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే వీరికి జూలై 13లోపు మాక్ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత విద్యార్థులు రెండు రోజులపాటు వెబ్ ఆప్షన్లను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది.
మాక్ కౌన్సెలింగ్ ఏంటంటే…?
ఈ ఏడాది నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియలో ఉన్నత విద్యా మండలి కొన్ని మార్పులు తీసుకువచ్చింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు మాక్కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ విధానంలో భాగంగా విద్యార్థికి వచ్చిన ర్యాంక్… ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా మాక్ సీట్(ప్రాథమికంగా) అలాట్‌మెంట్ చేస్తారు. విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా మార్పులు చేసుకునే అవకాశం ఇస్తారు. చివరగా ఫైనల్ సీట్ అలాట్‌మెంట్ చేస్తారు.
ఈ విధానంతో…. విద్యార్థులు తమ ప్రాధాన్యతలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూలై 13వ తేదీన లేదా ఆలోపు ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది. ఆ తర్వాత ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం కల్పిస్తారు. అంటే జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది.
జూలై 18న సీట్ల కేటాయింపు…
ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు చేసుకుని వెబ్ ఆప్షన్లనుఎంచుకున్న అభ్యర్థులకు… జూలై 18వ తేదీ లేదా ఆలోపే తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు…. జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక జూలై 25వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


